రెండు పెద్ద తలకాయలు అమి తుమి తేల్చుకునే సమయం వచ్చేసింది. ఇద్దరిలో ఎవరి ఆధిపత్యం ఏమిటో తేలిపోబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్స్ ఫండ్స్ మోసం కేసులో  ఏ1 సంస్ధ ఛైర్మన్  రామోజీరావు, అయన కోడలు, ఎండీ అయిన ఏ 2 శైలజా కిరణ్ కు నోటీసులు జారీచేసింది. నాలుగు తేదీలను ఇచ్చి ఏదో ఒక తేదీలో విచారణకు హాజరవ్వాల్సుంటుందని నోటీసులో స్పష్టంగా చెప్పింది.

ఇచ్చిన తేదీల్లో దేన్నో ఒకటి, అలాగే ఇల్లు లేదా ఆఫీసులో ఎక్కడో ఒక చోట విచారణకు హాజరయ్యే విషయంలో వాళ్ళిద్దరికే సీఐడీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. సీఐడీ ఇచ్చిన తేదీలు ఏవంటే మార్చి 29 లేదా 31వ తేదీలు. అలాగే ఏప్రిల్ 3 లేదా 6వ తేదీన విచారణకు కచ్చితంగా హాజరవ్వాలని  మాత్రం సీఐడీ స్పష్టంగా చెప్పింది. ఇల్లు లేదా ఆఫీసులో విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పింది. తేదీ, ప్లేసు డిసైడ్ చేసుకుని తమకు వెంటనే సమాచారం అందించాలని స్పష్టంచేసింది.

మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో రామోజీ భారీ ఎత్తున మోసానికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వం భావించింది.  1982 చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యాక్టును రామోజీ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నట్లు సీఐడీ చీటింగ్ కేసులు పెట్టింది. రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చిట్లు వసూలు చేయటమే కాకుండా చిట్టేతర వ్యాపారాలకు ఆ నిధులను మళ్ళిస్తున్నట్లు ఆధారాలు దొరికిందని సిఐడీ ప్రకటించింది.

మార్గదర్శి బ్రాంచీల్లో సోదాలు జరిపినా మేనేజర్లు, ఫోర్ మెన్లు తమకు సహకరించలేదని ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ రామకృష్ణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే రామోజీ తన మీడియాలో ప్రతిరోజు వార్తలు, కథనాలను అచ్చేస్తున్నారంటు మంత్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తునే మరోవైపు అక్రమగా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తు ఊరుకుంటుంది ? అసలు తన కంపెనీల వైపు అనుమానంగా చూస్తేనే రామోజీ సహించరనే ప్రచారం ఉంది. అలాంటిది ఏకంగా ఆయనతో పాటు కోడలుపైన చీటింగ్ కేసులు పెట్టి విచారణకు రమ్మని నోటసులు ఇవ్వటమంటే మామూలు విషయంకాదు.  మరి సీఐడీ నోటీసుల నేపధ్యంలో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: