ఉండి ఉండి జగన్మోహన్ రెడ్డి అమరావతి మద్దతుదారులను పెద్ద కొట్టారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బకొట్టారు. కొంతమంది ప్రముఖుల గేటెడ్ కమ్యూనిటిగా అమరావతిని మార్చేయాలని అనుకున్న చంద్రబాబునాయుడు అండ్ కో ఊహించలేనంతగా దెబ్బకొట్టారు. అమరావతిని జగన్ తాజాగా సామాజిక అమరావతిగా మార్చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతికి ట్యాగ్ లైనుగా పీపుల్స్ కేపిటల్ అని పిలిచేవారు. అమరావతి పేరుకుమాత్రమే పీపుల్స్ కేపిటల్.





వాస్తవంలోకి వచ్చేసరికి సామాన్యుడు కాదు కదా ఎగువమధ్య తరగతి జనాలు కూడా అటువైపు చూడాలంటే భయపడేంతస్ధాయిలో ప్లాన్ చేశారు. చంద్రబాబు ప్లాన్ చేసిన అమరావతి అంటే అచ్చంగా సంపన్నులకు మాత్రమే ఎంట్రీ దొరికే రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. అందుకనే జస్టిస్ సిటీఅని, స్పోర్ట్స్ సిటీ అని, ఇంకోటని మరోటని ఏవేదో పేర్లు తగిలించేసి నవనగరాలను నిర్మించబోతున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.





ఇదే సమయంలో జగన్ పాదయాత్రలో అమరావతి మీదుగా వెళ్ళినపుడు అక్కడి జనాలు కొందరు బాగా అవమానించారు. జగన్ పాదయాత్ర చేసిన రూట్లో పెద్ద పెద్ద ట్యాంకర్లతో పసుపునీళ్ళు చల్లుకుంటూ వెళ్ళారు. అంటే వీళ్ళ ఉద్దేశ్యంలో జగన్ పాదయాత్ర వల్ల తమ ప్రాంతమంతా మైలపడిందని. మైలపడిన ప్రాంతాన్ని శుద్ధిచేయటం కోసమే పసుపునీళ్ళు చల్లుతున్నట్లు చెప్పారు. కాలం ఎల్లకాలం ఒకేలాగుండదని అప్పట్ల పసుపునీళ్ళు చల్లని వాళ్ళు అనుకోలేదు. అందుకనే దానకి ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్నారు.





తమ ఆశలను జగన్ నాశనంచేసేశాడని శాపనార్ధాలు పెడుతున్నారు. అత్యంత సంపన్నులు మాత్రమే ఉండగలిగిన అమరావతిలో జగన్ ఏకంగా 51 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసి ఇళ్ళు కూడా కట్టిస్తున్నారు. దానికే సోమవారం భూమిపూజ జరిగింది. అమరావతిలోకి ఎవరైతే వచ్చేందుకు లేదని ఓవరాక్షన్ చేశారో ఇపుడు వాళ్ళకే ఇళ్ళుకట్టించి ప్రభుత్వం ఇస్తోంది. అందుకనే దాన్ని జగన్ సామాజిక అమరావతి అని ప్రకటించింది. అతిచేస్తే గతిచెడుతుందనే సామెత ఇలాంటి వాళ్ళ చేష్టలను చూసే పుట్టినట్లుంది. అప్పట్లో కొందరు అతిచేయకపోతే ఇపుడు అందరికీ ఈ గతి పట్టుండేది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: