ఎప్పుడు కూడా ప్రతిపక్షాలపై పడి మాట్లాడుతుంటే..దేశాన్ని నిర్మించేదెప్పుడు అని ఆయన ప్రశ్నించారు. చాలా మంది నాయకులు దేశాన్ని పాలించారని... కానీ వీరొక్కరే దేశాన్ని అభివృద్ధి చేసినట్లుగా మాట్లాడటం అసలు సరికాదని మల్లికార్జున ఖర్గే అన్నారు.అలాగే ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకులకు హాజరుకాకపోవడంపైనా మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తనకు కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ముందుగా ప్రొటోకాల్ ప్రకారమే ఉదయం 9.20 గంటలకు ఇంటి వద్ద జెండాని ఎగురవేశానని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించానని ఖర్గే చెప్పారు. అందుకే సమయానికి ఎర్రకోట దగ్గరకి చేరుకోలేకపోయానని వివరించారు మల్లికార్జున ఖర్గే. ఇంకా దీనికి తోడు భద్రతా దళాలు ప్రధానిని తప్ప ఎవరినీ ముందుకు వెళ్లనీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలు ఇంకా సమయాభావం కారణంగా ఎర్రకోటకు వెళ్లకపోవడమే మంచిదని భావించానని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎర్రకోటలో ఆగస్ట్ 15 వేడుకల సందర్భంగా ఖర్గే కోసం కేటాయించిన సీటు ఖాళీగా కనిపించింది. దాంతో.. ఖర్గేతో పాటు కాంగ్రెస్ కూడా వివరణ ఇచ్చింది. అనారోగ్య కారణాలతోనే హాజరుకాలేకపోయారంటూ ఆయన తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి