జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సంతోషాన్ని పట్టలేకుండా ఉన్నారా ? అవుననే అనిపిస్తోంది స్పందన చూసిన తర్వాత. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులకు కామన్ సింబల్ గా గాజుగ్లాసును కేటాయించటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ అంగీకరించింది. ఈ మేరకు పార్టీ ఆఫీసుకు సమాచారాన్ని అందించినట్లుంది. అందుకనే పవన్ సంతోషాన్ని పట్టలేకుండా ఉన్నారు.

తన సంతోషాన్ని పవన్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ తో పాటు తెలంగాణా, ఏపీ ఎన్నికల కమీషనర్లకు, ఎన్నికల సంఘాల్లోని అధికారులకు పదేపదే ధన్యవాదాలు తెలుపుకోవటంతోనే బయటపడింది. నిజానికి ఏ పార్టీకి అయినా గుర్తుంపు అన్నది దాన్ని ఎన్నికల గుర్తుతోనే బలపడుతుంది. పలానా గుర్తును చూడగానే జనాలకు పలానా పార్టీ గుర్తుకొచ్చేయాలి. అలా వస్తేనే పార్టీ జనాల్లో మనసుల్లో ఉన్నట్లు లెక్క. కానీ జనసేన విషయంలో ఎప్పుడూ ఇది జరగలేదు. 
గుర్తులేనపుడు ఆ పార్టీ ఎంతకాలం యాక్టివ్ గా ఉన్న ఎలాంటి ఉపయోగం ఉండదు. 2019 ఎన్నికల్లో కామన్ సింబల్ గాజుగ్లాసుతోనే పోటీచేసినా ఉపయోగంలేకపోయింది. అయితే ఆ తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కానీ గాజుగ్లాసు గుర్తుగా పార్టీకి దొరకలేదు. కమీషన్ ప్రమాణాలను జనసేన అందుకోలేకపోయిన కారణంగా గాజుగ్లాసు గుర్తును కమీషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. నిజంగా ఈ విషయం పవన్ కు అవమానమనే చెప్పాలి.
అలాంటిది రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు రకరకాల గుర్తులమీద పోటీచేస్తారా ? లేకపోతే టీడీపీ సింబల్ మీద పోటీచేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే రిజిస్టర్డ్ పార్టీ హోదానే అయినప్పటికీ గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు కమీషన్ చెప్పటంతో పవన్ సంతోషాన్ని పట్టలేకపోతున్నారు. మరిప్పటికైనా రిజస్టర్డ్ పార్టీ హోదా నుండి రికగ్నైజ్డ్ పార్టీ హోదాను సంపాదించుకుంటారా ? లేకపోతే ఎప్పటికీ రిజిస్టర్డ్ పార్టీగానే జనసేనను ఉంచేస్తారా ? అన్నది తేల్చుకోవాలి. మరి చివరకు ఏమిచేస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: