తండ్రి, కొడుకులు చంద్రబాబునాయుడు, లోకేష్ టెన్షన్ కంటిన్యు అవుతోంది. స్కిల్ స్కామ్ లో ఇరుక్కుని చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 23 రోజులుగా రిమాండు ఖైదీగా ఉన్నారు. తనపైన సీఐడీ నమోదుచేసిన అన్నీ కేసులను కొట్టేయాలని సుప్రింకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. పిటీషన్ పై విచారణ జరిగిన తర్వాత కేసు 9వ తేదీకి వాయిదాపడింది. అంటే మరో ఐదురోజులు టెన్షన్ కంటిన్యు అవ్వకతప్పదు. టెన్షన్ ఎందుకంటే చంద్రబాబు తరపు లాయర్ల వాదనలో పసలేదని జడ్జీలకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే వీళ్ళ వాదనలను జడ్జీలే చాలాసార్లు అడ్డుకున్నారు.
విచారణలో ఎక్కువభాగం 17 ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందా వర్తించదా అన్న విషయంమీదే జరిగింది. 17ఏ అంటే గవర్నర్ అనుమతిలేకుండా చంద్రబాబును అరెస్టు చేయవచ్చా ? చేయకూడదా ? అన్నదే పాయింట్. చంద్రబాబును అరెస్టుచేయటానికి గవర్నర్ అనుమతి అవసరంలేదని ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అని చంద్రబాబు తరపు హరీష్ సాల్వే, సిద్దార్ధ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. అయితే 17 ఏ చంద్రబాబు అరెస్టుకు ఎందుకు వర్తించదో అన్న విషయాన్ని రోహత్గీ జడ్జీలకు వివరించారు.
దాంతో జడ్జీలు కూడా చంద్రబాబు లాయర్లను చాలాసార్లు ఎదురు ప్రశ్నించారు. ఒకవిధంగా చెప్పాలంటే ముగ్గురులాయర్ల వాదనలో పసలేదని జడ్జీలకు అర్ధమైపోయింది. అందుకనే చంద్రబాబు వయసు 73 ఏళ్ళని, రాజకీయకక్షతోనే అరెస్టుచేశారని లాయర్లు ఎంత వాదించినా జడ్జీలు పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఏమీ లేదన్న రోహత్గీ వాదనతోనే జడ్జీలు ఏకీభవించినట్లుగా ఉంది.
ఎందుకంటే స్కిల్ స్కామ్ కేసు బయటపడింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు. జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఈడీ, సెబీ, సీబీఐలు కేసును విచారించింది కూడా చంద్రబాబు హయాంలోనే అని రోహత్గీ డాక్యుమెంట్లను చూపించారు. స్కిల్ స్కామ్ బయటపడింది చంద్రబాబు హయాంలోనే అని, కొన్ని అరెస్టులు, రిమాండులు, ఆస్తుల జప్తు జరిగింది కూడా 2019కి ముందే అయినపుడు ఇందులో రాజకీయ కక్ష ఎక్కడుందన్న రోహత్గీ ప్రశ్నకు చంద్రబాబు లాయర్లు సమాధానం చెప్పలేకపోయారు. రెండువైపుల వాదనలు విన్న జడ్జీలు కేసును 9వ తేదీకి వాయిదావేశారు. అర్జంటుగా విచారించాలన్న లూథ్రా విజ్జప్తిని జడ్జీలు పట్టించుకోలేదు.
అలాగే రింగ్ రోడ్డు స్కామ్ లో సీఐడీ విచారణకు 10వ తేదీన లోకేష్ హాజరైతీరాలని హైకోర్టు ఆదేశించింది. ముందస్తుబెయిల్ పిటీషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి చంద్రబాబు, లోకేష్ కు తమ కేసుల్లో ఏమి జరగబోతోందో అర్ధంకావటంలేదు. కాబట్టి ఇద్దరు కూడా మరో ఐదారురోజులు ఎదురుచూడాల్సిందే తప్ప వేరేదారిలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి