మరోపక్క పదేళ్లుగా జెండా మోస్తున్న మాకు ఏం చేశారు అని, సింహాద్రిపురం లో మెజార్టీ రాదని అక్కడి వాళ్ళు అన్నట్లుగా మరో పత్రిక రాసుకొచ్చింది.
అసలు పులివెందులలోను, కడప జిల్లాలోనూ జగన్ పేరు చెప్పుకొని సంపాదించుకుంటూ ఉంటే జగన్ ఏం చేశాడని అడగడం ఏమిటి అని కొందరు ఆశ్చర్యపడుతున్నారు. అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్ రైతులను దోచేసుకుంటున్నారంటూ తెలుగుదేశం మీడియా హడావుడి చేస్తుందట. ఒక సమయంలో అమరావతిలో ఒక సామాన్య రైతుకు సంబంధించినటువంటి భూమి విలువ కోటి రూపాయల నుండి 4కోట్ల రూపాయల వరకు భారీగా పెరిగింది.
ఆ సందర్భంలో చంద్రబాబు ఫోటోని వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన పెట్టి పూజించుకుంటున్నాం అన్నట్లుగా అమరావతి రైతులు గతంలో చెప్పుకొచ్చారు. అయితే అసైన్డ్ భూమి గల రైతులకు మాత్రం అదే భూమి విలువ ఐదు లక్షలకు పడిపోయిన సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళపై ఎటువంటి ప్రేమ చూపించలేదు. అలాంటి చంద్రబాబు అసైన్డ్ రైతులను జగన్ దోచేసుకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు.
అసలు చంద్రబాబు గురించి పాజిటివ్ గా ప్రజెంట్ చేయడం కన్నా, జగన్మోహన్ రెడ్డి పై నెగిటివ్ ప్రచారాన్ని తీసుకురావడం అనేది వీళ్ళ వ్యూహంలా కనిపిస్తుంది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేక ఓటును సిద్ధం చేయడానికి వీళ్లంతా కష్టపడుతున్నారు. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఓడిపోలేదు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రభావంతో వైసిపి విజయం సాధించి, టిడిపి ఓడిపోయింది. మరి ఇది ఎందుకు గమనించడం లేదు టిడిపి శ్రేణులు అని అడుగుతున్నారు రాజకీయ నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి