మరోవైపు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇది కూడా ఇరాన్ తయారు చేసిన ఇరాక్ లోని తీవ్రవాద సంస్థ. ఒకప్పుడు ఇరాక్ ను ఆక్రమించుకోవాలని ఇరాన్ అనుకున్న సమయంలో అమెరికా సహకరించింది. ముందు ఇరాక్ ఓడిపోయి ఆదేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దొరికే వరకు కూడా ఏదో భయంకర ఆయుధాలు ఉన్నాయని చెప్పేవారు. విచిత్రమేంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఒక్క ఆయుధం కూడా దొరకలేదు. ఇరాన్ చెప్పిన అబద్ధాలను నమ్మి ఈ నివేదికను సీఐఏ అందజేసింది.
ఈ క్రమంలో ఇరాన్ లో తమ ప్రభుత్వమే ఉండాలని భావించిన అమెరికా ఓ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వెనుక నుంచి దానిని నడిపించింది. కానీ మత తీవ్రవాదం, మత ఉన్మాదంతో పాటు సద్దాం హుస్సేన్ అనుకూల వర్గాలు క్రైస్తవ మతాన్ని అంగీకరించలేకపోయింది. ఇది ఇరాన్ కు అనుకూలంగా మారింది. దీని వెనుక అమెరికా ఉందని రెచ్చగొట్టింది.
దీంతో అక్కడ ఉన్న ముస్లిం యువతతో ఇస్లామిక్ రెస్టిస్టెన్స్ ఫోర్స్ అనే తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసింది. వీళ్ల ద్వారా అమెరికా పై దాడులు చేయిస్తోంది. ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదులపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ పై వీరిని ప్రయోగిస్తోంది. ఇప్పటి వరకు అమెరికా సైన్యంపై తప్ప ఇతర దేశాలపై దాడులు చేయని వీరిని ఇజ్రాయెల్ పై ఇరాన్ ఉసిగొల్పుతోంది. తొలిసారిగా ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడులు చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష యుద్ధానికి ఇరాన్ దిగిందనే చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి