అయితే మొదట్లో ఈ విషయం పైన జనసేన కార్యకర్తలు అభిమానులు సాయంత్రం చాలా ఫైర్ అయ్యారు.. టిడిపి నేతలు కూడా చాలామంది ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపించాయి.. ఇప్పటికీ కూడా ఈ పొత్తుల విషయం పైన చాలామంది నిరాశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.. ఎవరేమనుకున్నా చంద్రబాబు నాయుడుతోనే కలిసి ఈసారి పోటీలు నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే సీట్ల విషయంలో కొంతమంది మాత్రం జనసేనకు ఎక్కువగా ఇవ్వాలంటూ పలువురు కాపు నేతలు కూడా పలు లేఖలు రాస్తూ ఉన్నారు.
అందుకే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా కూడా కాపు నేతలను తమ పార్టీల చేర్చుకుంటూ ఉంటున్నారు అయితే సీట్ల విషయం ప్రకారం.. టిడిపి నేత ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేనకు 24 నుంచి 25 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. కానీ జనసేన అధినేత మాత్రం 40 నుంచి 50 సీట్ల వరకు కోరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని సీట్లు చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.. కేవలం అధికారంలో ఉన్న జగన్ ను ఓడించడానికి ఇలాంటి పన్నాగాలు పడుతున్నారు తప్ప.. మరి ఏ మాత్రం ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి. సీట్ల వల్ల కూడా టిడిపి జనసేన మధ్య ఏవైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి