రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేస్తున్నారు. కొందరు ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరించారు. మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మార్చుతున్నారు. ఇప్పటికి 60 అసెంబ్లీలు, 10 లోక్ సభకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో 23 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఎగిరిపోయాయి. అయితే మొదటిసారి టికెట్లు దక్కిన వాళ్ళు, నియోజకవర్గాలు మారిన వాళ్ళలో కొందరి విషయంలో రీ సర్వే జరిపించాలని జగన్ అనుకున్నట్లు సమాచారం.





దీనికి కారణం ఏమిటంటే కొత్త, నియోజకవర్గాలు మారిన వాళ్ళలో కొందరి నుండి వచ్చిన రిక్వెస్టులేనట. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నామని చెప్పి వచ్చిన సర్వే ఫలితాలను పార్టీ కీలక నేతలకు అందించారట. అందులో కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిందని సమాచారం. ఆ సమాచారన్ని కీలకనేతలు జగన్ ముందుంచారట. ఆ రిపోర్టును పరిశీలించిన జగన్ క్రాస్ చెక్ చేసుకోవాలని అనుకున్నారట. ఏదైనా కారణంగా తన రిపోర్టులో తప్పులు దొర్లుంటే అప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నపుడు అసలు విషయం బయటపడుతుందని అనుకున్నారట.





ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పటివరకు డిసైడ్ చేసిన టికెట్ల విషయంలో ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయంకాదు. దాదాపు ఏడాదిన్నరగా 175 నియోజకవర్గాల్లోను సర్వేలు చేయిస్తునే ఉన్నారు. ఎవరికైనా టికెట్ ఇవ్వకూడదని అనుకుంటే ఆ నియోజకవర్గంలో ప్రత్యామ్నయాలపైన కూడా సర్వేలు చేయించుకున్నారు. సర్వేలు చేయించుకున్న ప్రత్యామ్నాయాల్లో ఎవరు బెస్ట్ అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించిన తర్వాతే సిట్టింగ్ ఎంఎల్ఏకి టికెట్ నిరాకరిస్తున్నారు. అంటే ఎంఎల్ఏని కంటిన్యుచేయాలన్నా, కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలన్నా,  నియోజకవర్గం మార్చాలన్న నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది.





ఇంతపెద్ద కసరత్తు చేసిన తర్వాత కూడా ఎక్కడైనా పొరబాట్లు జరిగితే ఆయా నియోజకవర్గాల్లో రీ సర్వే చేయటానికి కూడా జగన్ రెడీగా ఉన్నారు. ఈనెల 25వ తేదీనుండి జనాల్లోకి వెళ్ళటానికి జగన్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. కాబట్టి 25 నుండి పర్యటనలు మొదలైన తర్వాత అవసరమైతే రీ సర్వే చేయించాలని అనుకున్నారట. అయితే ఇలాంటి రీసర్వే చేయించాల్సిన నియోజకవర్గాలు చాలా తక్కువుంటాయని పార్టీవర్గాల సమాచారం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: