ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోకుండా ప్రజలు ఉండలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వారందరిని పలకరిస్తూ రాని వారి గురించి ఆలోచించకుండా ముందుకు వెళుతున్నారు.. ఏపీ సీఎం చేసిన పనులను చూసి అందరూ కూడా ముక్కున వేలు వేసుకునేలా పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలని కూడా ఆయన వైపు చూసేలా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
రాబోతున్న ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేనొక్కడినే ఒకవైపు మిగిలిన వారంతా ఒకవైపు ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధమే అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు..ఓటర్లే నా ధైర్యం మీరే నా సైన్యం అంటూ ఓటర్లను సైతం ఆనందపరిచేలా స్పీచ్ లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దేశంలోనే ఏ పార్టీ చేయని సంక్షేమ పథకాలను ప్రతి పేద ఇంటికి ఉచితంగానే అందించిన తీరు ఇవన్నీ కూడా చాలామంది నాయకుల చేత ప్రశంసలు అందుకునేలా చేశాయి.. ముఖ్యంగా పొత్తులకు పోనీ నాయకుడు పొత్తుల గురించి అసలు మాటే ఎత్తని నాయకుడు కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. కేవలం తన వ్యూహం ఫలిస్తుందని నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి