ఏపీలోని ఎన్నికల సమీకరణాలు రోజురోజుకీ చాలా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా పొత్తులు ఓకే అయినట్లు చెబుతున్నప్పటికీ రోజు రోజుకి సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఇతర పార్టీలకంటే ఎన్నికలు యుద్ధంలో చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. టిడిపి ,జనసేన మాత్రం ఇంకా అభ్యర్థుల విషయంలో కొలిక్కి రాలేకపోతోంది.. ముఖ్యంగా బీజేపీ నిర్ణయం కోసం రెండు పార్టీలు సైతం వేచి ఉంటున్నాయి. అటు పొత్తుల చర్చలు చేస్తున్నప్పటికీ బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.


కానీ ఇప్పుడు అనూహ్యంగా సరికొత్త లెక్కలు తెర మీదికి వస్తున్నాయి.. ఈసారి ఎన్నికలలో గోదావరి జిల్లాలోని ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇక్కడ పవన్ సహకారంతో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని చంద్రబాబు ఎన్నో వ్యూహాలు సైతం పడుతున్నారు. జనసేనకు ఇక్కడే ఎక్కువ సీట్లు ఇవ్వాలని పొత్తులో భాగంగా చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలకు బిజెపి కలుస్తుందని ఆశ గత కొద్దిరోజులుగా ఉన్నది.. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ మాత్రం ఎటు తెలుసుకోకుండా పెండింగ్లో పెట్టేసింది.

దీంతో టీడీపీ, జనసేన పార్టీలో అభ్యర్థులు ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు ఉంటాయని విషయం కూడా ఇంకా పార్టీ నుంచి స్పష్టత కనిపించలేదు.ఇదే సమయంలో ముద్రగడ రాజకీయ ప్రయాణం పైన కూడా పలు రకాల వార్తలు మొదలయ్యాయి 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా ఉన్న ముద్రగడ జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్తో చర్చలు జరిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో పవని స్వయంగా వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముద్రగడను పక్కన పెట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి. కాపు ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ముద్రగడ చేరితే బలంగా మారుతుందని పవన్ కళ్యాణ్ అంచనా వేసినప్పటికీ తాను మాత్రం వచ్చే ఎన్నికలలో ఎంపీ టికెట్ తో పాటు ఆయన కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.


దీంతో ఒక్కసారిగా జనసేన చేరికలు ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ముద్రగడ బిజెపి నేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్లే ముద్రగడతో భేటీకి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి ముద్రగడ మౌనం వెనుక కారణాలు ఏంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: