ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకీ చాలా రసవత్తంగా మారుతున్నాయి.. అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష నేత టిడిపి జనసేన కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.. వైసిపి పార్టీ సీఎం జగన్ పూర్తిగా గెలుపు గుర్రాల వైపే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు.ముఖ్యంగా ప్రజలలో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను సైతం మారుస్తూ రెండవ సారి కూడా గెలవాలని టార్గెట్తో ముందుకు వెళుతున్నారు. గత కొద్దిరోజులుగా టిడిపి జనసేన పొత్తులతో పాటు బిజెపి పొత్తు కూడా కలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


ఇందులో భాగంగా పొత్తులపై చర్చించేందుకు టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి మరి పెద్దలను కలిశారు. దాదాపుగా ఇప్పటికీ 15 రోజులు కావస్తున్న పొత్తుల పైన మాత్రం ఎలాంటి ప్రకటనలు కనిపించలేదు.. అటు టిడిపి నేతలు జనసేన మధ్య పొత్తు మాత్రమే ఉంటుందని బిజెపి పార్టీతో ఉండదని వార్తలు వినిపించాయి.. ఈ తరుణంలోనే జనసేన బీజేపీ టిడిపి పొత్తుల పైన పవన్ కళ్యాణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తూ అక్కడ స్థానిక నేతలతో భేటీ అయ్యారు.

అక్కడ మాట్లాడుతూ టిడిపి జనసేన బిజెపి పొత్తు కోసం చాలా కష్టపడ్డాననీ.. దండం పెట్టి మరి మూడు పార్టీల పొద్దుకి ఒప్పించాను అంటూ తెలియజేశారు. బిజెపితో కొత్త వ్యవహారం పైన ఎన్నో చివాట్లు తిన్నాను నాకు తెలుసు అని వాళ్ళని ఒప్పించడానికి నానా మాటలు పడ్డానని కూడా తెలిపారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసమే భరించాను అంటూ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికలలో బిజెపి జనసేన టిడిపి పొద్దుతో ఏ శక్తి కూడా తమని ఆపలేదంటే తెలిపారు.. జగన్ సిద్ధం అంటే మేము సిద్ధమే అంటూ తేల్చేశారు. మరి పొత్తుల విషయం పైన మూడు పార్టీలు ఉంటాయా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: