ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరకి సమీపిస్తున్న సమయంలో వైసీపీ పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ టిడిపి జనసేన కూడా ఈసారి గెలవడానికి తమ సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయి.. టిడిపి పార్టీ ఈసారి ఎన్నికలు జీవస్మరణ సమస్యగా మారిపోయింది.ముఖ్యంగా చంద్రబాబుకు చాలా కీలకంగా ఈ ఎన్నికలు ఉన్నాయి పొరపాటున ఓటమి ఎదురైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉనికినే కోల్పోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబును నమ్ముకున్న వ్యవస్థలు వ్యక్తులు సైతం చాలా దెబ్బ తినక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే చంద్రబాబు కంటే వ్యవస్థలలో ఉన్నవారు..వ్యక్తులు సైతం తమ పార్టీ గెలవాలని చాలా ఆరాటపడుతున్నారు.

గతంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు కంటే ఎక్కువగా రామోజీరావు పైన చాలా దృష్టి పెట్టారు.. ముఖ్యంగా మార్గదర్శి చిట్ఫండ్ పైన కేసులను కూడా నమోదయ్యాయి చిట్ఫండ్ ద్వారా సేకరించిన నగదుతో రామోజీరావు వ్యాపారాలకు చెక్ పెట్టారు. దీంతో రామోజీరావు ఏర్పర్చిన పలు మీడియా ఛానల్స్ సైతం రిలయన్స్ కు అమ్మే పరిస్థితి ఏర్పడింది.. అయితే అప్పుడు చాలా లోతు వరకు మాత్రం రాజశేఖర్ రెడ్డి వెళ్లలేదు.


కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు రామోజీరావు ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.. ఈసారి జగన్ సీఎం అయితే కచ్చితంగా రామోజీరావుకు జైలు జీవితం తప్పదు.. అందుకే ఆయన కూడా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు.. 2024లో ఏపీ సీఎం జగన్ అయితే చంద్రబాబు వెనుక ఉండే వ్యవస్థలకు వ్యక్తులను సైతం చాలా దెబ్బతీస్తారని కూడా చెప్పవచ్చు. మొదట అమరావతి రాజధాని చుట్టూ జరిగిన విషయాలను సైతం బయటికి వెలికి తీసే పనిలో చేయబోతున్నారట. అంతేకాకుండా చంద్రబాబు పైన పడినటువంటి కేసులలో కూడా మరింత పటిష్టంగా ఉండే విధంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం ఎక్కువగా ప్రజల సంక్షేమ వైపు గానే అడుగులు వేస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం.. ఎక్కువగా బిజినెస్ వ్యాపారాలు చేసే వారిపైనే దృష్టి పెట్టేవారు. మరి ఈసారి మేనిఫెస్టో ఏవిధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: