జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా కాపు నేతల నుంచి లేఖలు వస్తూనే ఉన్నాయి.. ఇటీవలే సీనియర్ నేత హరి రామ జోగయ్య కూడా ఇటీవలే వరుసలేఖలు రాశారు.. చివరికి ఈయన కూడా పవన్ కళ్యాణ్ ను వదిలేయడం జరిగింది.తాజాగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం జనసేన అధినేతకు లేఖ రాశారు.. జనసేన తీరు పైన తన లేఖలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.. పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలో తన నివాసానికి వస్తానంటూ తెలిపారని.. కానీ అక్కడికి రాలేదని ముద్రగడ గారు వెల్లడించారు..


2019 ఎన్నికల సమయంలో కవాతు కార్యక్రమానికి ముందు తమ ఇంటికి వస్తామంటూ రాకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉన్నామని ఇటీవల అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత వస్తానని చెప్పి మళ్లీ రాలేదని.. ఇలా ఎన్నోసార్లు మాట తప్పారని తెలిపారు.. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే తమ వంతు కృషి చేయాలని పవన్తో నడవాలి అనుకున్నాను.. అయితే గతంలో జరిగిన అవమానాలను పక్కనపెట్టి మరి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని.. అయితే పవన్ ముద్రగడ కలిసి పని చేయాలని కాపు జాతి మొత్తం కోరుకుందంటూ లేఖలో వివరించారు.


అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం తనకు ఇవ్వలేకపోయారని లేఖలో వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థాయిలో ఉండాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ షేరింగ్లో భాగంగా 80 సీట్లు అసెంబ్లీ స్థానాలు రెండేళ్లు ముఖ్య మంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ సాహసం చేయలేకపోయారని వెల్లడించారు ముద్రగడ.. పవన్ లాగా తాను గ్లామర్ పరపతి ఉన్నవాడిని కాదని తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిని అందుకే తనని లాస్ట్ గ్రేడుగా పెట్టేసారు అంటూ తన ఇంటికి వస్తామని చెప్పి రాకపోయారని ముద్రగడ గారు వెల్లడించారు.. అంతేకాకుండా పవన్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని చాలా చోట్లకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చురకలంటించారు ముద్రగడ.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న 24 స్థానాలలో అభ్యర్థుల కోసం తమ అవసరం రాకూడదని కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు ముద్రగడ.

మరింత సమాచారం తెలుసుకోండి: