ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ మరియు అధికార పార్టీ వైకాపా ప్రచారాల్లో ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. అయితే వారి వారి ప్రచారాల్లో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. అయితే వైసీపీ ప్రధానకార్యదర్శి, నెల్లూరు వైకాపా లోక్‌సభ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడు ఐనటువంటి విజయసాయిరెడ్డికి చెప్పుకోలేని ఘోర అవమానం జరిగింది.నెల్లూరు నుండి లోక్‌సభ అభ్యర్థిగా నిల్చున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.దాంట్లో భాగంగానే ఆయనకు ఆ ప్రచారంలో ఒక పెద్ద ఘోర అవమానం జరిగింది.ప్రస్తుతం డానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇపుడే ఆ వైరల్ గా మారిన వీడియో విషయానికి వస్తే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో విజయసాయిరెడ్డి ప్రచార రథంపై స్థానిక వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆయన తన ప్రసంగం స్టార్ట్ చేద్దామనుకొని మాట్లాడేందుకు మైక్ అందుకున్నారు.అపుడు వెంటనే కార్యకర్తలు, మహిళలు ఇంటిముఖం పట్టారు.

అయితే ఆలా జరగడం గమనించిన ప్రజారథంపై ఉన్న నాయకులు మహిళలను వెళ్ళొద్దు వెళ్లొద్దు, ఆగండి ఆగండి అంటూ అంటూ మన పెద్దాయన విజయసాయిరెడ్డి గారు ప్రసంగించే వరకు ఆగాలని అక్కడ నుండి వెళ్లిపోతున్న మహిళలను, కార్యకర్తలను వేడుకున్నారు. అయితే వారందరిని ఆపే ప్రయత్నంలో భాగంగా భోజనాలు కూడా ఉన్నాయని అందరూ తినేసి వెళ్లాలని కోరినా కూడా దాని ప్రభావం వాళ్ళ పై పడలేదు అని తెల్సింది.అయితే దీనికి  సంబంధించిన అదే వీడియో ప్రస్తుతం ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ప్రచారరధం పై ఉన్న ఒకనేత మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన మాట్లాడతారని మైకులో గొంతు పోయేలా అరిచినా కూడా ఒక్కళ్ళు కూడా  పట్టించుకోలేదు సరికదా వెనక్కి కూడా తిరిగి చూడలేదు. చెప్పేది వినండి, వెనక్కి రండి, ఇటు చూడండి.వెళ్లిపోయేవాళ్ళందరు మాకు కనిపిస్తున్నారు. దయచేసి మీరు పోవద్దు అంటూ మైకులో పదేపదే చెపుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే అక్కడ జరిగిన సంఘటన అనేది లోకసభ అభ్యర్థి అయినా విజయసాయిరెడ్డి కి జరిగిన ఘోర అవమానంగానే భావించాలి అంటూ అర్ధం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: