ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లో టీడీపీ వర్సెస్ వైసీపీ నువ్వా నేనా అంటూ తలబడుతున్నాయి.టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావకు అక్కడ జన బలం మంచి పీక్ స్టేజ్లో ఉంది.అదే కాకుండా ప్రస్తుతం టీడీపీ కి జనసేన,బీజేపీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా పుల్లారావు గెలుపు పక్క అని సర్వెలు చెబుతున్నాయి.అయితే ఇక్కడ ఈ మూడు పార్టీలు కలసినా కలవకపోయినా ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం పక్కాగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.కాకపోతే ఆయన 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఓటమి పాలు అయ్యారు.

ఈసారి ఆయన గెలుపు కోసం దాదాపు రెండేళ్ల నుండే కసరత్తు మొదలెట్టేశారు.అయితే 2019 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయినా విడదల రజనీ మీద చెప్పలేనంత తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఆమెను అక్కడ నుండి మార్చి ఆమె సిఫార్సుతోనే మల్లెల రాజేష్ నాయుడుకి టికెట్ ఇచ్చారు.కాకపోతే ప్రస్తుతం కొన్ని రజనికి రాజేష్ నాయుడు కి మధ్య వ్యక్తిగత బేధాల వల్ల రాజేష్కి టికెట్ కాన్సల్ చేయడం జరిగింది అలా చేయడానికి కారణం రజిని అని స్థానికంగా ప్రజలందరూ అంటున్నారు.ఆ కారణంగా ఆయనను మార్చి గుంటూరు మేయర్ ఐనా కావటి మనోహర్ నాయుడుకు టికెట్ ఇచ్చారు.

ఆయన నాన్ లోకల్ కావడం వల్ల ఆయనకి నియోజకవర్గంలో పట్టు తక్కువ అని అందరూ అంటున్నారు దాంతో వైసీపీలో వర్గ పోరు పీక్స్ కి చేరింది.ఇదిలా ఉంటే ఇక్కడ మర్రి రాజశేఖర్ అనే సీనియర్ నేత ఉన్నారు. ఆయనకు టికెట్ 2014లో ఇచ్చారు కానీ 2019 ఎన్నికల్లో పక్కన పెట్టి రజినికి ఇవ్వడంతో అసలైన వర్గ పోరు వైసీపీ లో స్టార్ట్ యిందని చెప్పాలి.అయితే ప్రస్తుతం వర్గ పోరు సాగుతూండగానే రాజేష్ నాయుడు ఇటీవల వెళ్ళి టీడీపీలో చేరిపోయారు. దాంతో పుల్లారావుకి బాగా అదికూడా బాగా కలిసిస్తుంది. మరో వైపు ఒక్క వైసీపీలోనే మూడు ముక్కలాట సాగుతోంది అని అనడంలో ఆశ్చర్యం లేదు. విడదల రజనీది ఒక వర్గం, మర్రి రాజశేఖర్ మరో వర్గం, కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్ధి చుట్టూ ఉన్న ఇంకొక వర్గం తో వైసీపీ ఇబ్బందుల్లో పడుతుంటే టీడీపీ మాత్రం దూసుకుపోతోంది అని స్థానిక ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: