ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో అనంతపురం జిల్లాలో రాజకీయాల చాలా కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ లో సీనియర్గా మెయిన్ లీడర్ గా ఉన్న జే.సీ. ఫ్యామిలీకి చంద్రబాబు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి.. అలాగే  జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇద్దరు కూడా టిడిపి నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. 2019లో ఈ ఇద్దరికి టికెట్ ఇవ్వడం జరిగింది టిడిపి అధినేత చంద్రబాబు.


అయితే ఈసారి మాత్రం అస్మిత్ రెడ్డికి టికెట్ కేటాయించి పవన్ కుమార్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2019 ఎన్నికలలో జెసి పవన్ కుమార్ రెడ్డి అనంతపూర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయగా లక్ష 41 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది.. ఆ సమయంలోనే అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా.. వైసిపి అభ్యర్థి అయినటువంటి  కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 7000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి అస్మిత్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వగా చంద్రబాబు అనంతపూర్ ఎంపీ స్థానం నుంచి పవన్ కుమార్ రెడ్డికి బదులుగా అంబికా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడం జరిగింది.


ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం.. పవన్ కుమార్ రెడ్డికి అనంతపూర్ పార్లమెంటు సీటు ఇచ్చేందుకు కుదరకపోయిన సమయంలో కళ్యాణదుర్గం, గుంతకల్లు అసెంబ్లీ స్థానాలను పరిశీలించాలంటూ చంద్రబాబుని పవన్ కుమార్ రెడ్డి కోరినప్పటికీ చంద్రబాబు ఈ విషయాలను అసలు పట్టించుకోలేదు.. గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాంను అభ్యర్థిగా నిలబెట్టగా కళ్యాణ దుర్గంలో అమిలినేని సురేంద్రబాబుకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. దీంతో రాబోయే ఎన్నికలలో జెసి పవన్ కుమార్ రెడ్డి పోటీ చేయలేకపోయారని.. ఆయన కార్యకర్తలు పలువురు టిడిపి నేతలు కూడా నిరుత్సాహంతో ఉన్నారు.. మరి కొంతమంది నేతలు కార్యకర్తలు జెసి బ్రదర్స్ చంద్రబాబును నమ్ముకుంటే.. గోవింద గోవిందా  అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: