•ఉగాది జాతకాలు
 •ఈసారి సీఎం అయితే మరో మూడు సార్లు భయం లేదు
: •పంచాంగం వారికే అనుకూలం


( ఏపీ -ఇండియా హెరాల్డ్)
భారత రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఎలక్షన్స్ త్వరలోనే జరగనున్నాయి.. పైగా తెలుగువారి తొలి పండుగ ఉగాది నేడు.. ఈ సందర్భంగా రాజకీయ నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కి చాలా జాతకం ఎలా ఉంది వీరిలో అధికారాన్ని పొందేది ఎవరు.. ?కొత్త ఏడాది జాతకం ఎవరికి అనుకూలంగా ఉంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. జాతకరీత్యా అట చంద్రబాబు నాయుడు కి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ చాలా చక్కగా ఉందని పండితులు చెబుతున్నారు.  ఇద్దరూ కూడా రాజశ్యామల యాగాన్ని చేశారు.. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాజశ్యామల యాగం తోపాటు వారాహి యాగాన్ని కూడా చేశారు. ఒక రకంగా చూస్తే ఈ ఉగాది తర్వాత ఈ ముగ్గురి జాతకాలు ఇంచుమించు ఒకే లాగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్వేల ప్రకారం మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఈ  సంవత్సరం  జరగబోయే ఎన్నికలలో ఎవరైతే సీఎం  అవుతారో.. వారు వరుసగా మూడు పర్యాయాలు  సీఎం గా  గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుపుతున్నారు పండితులు. అయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కుజ ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయని.. చాకచక్యంగా , చురుకుదనంతో సమస్యలను పరిష్కరించుకుంటూ  ముందుకు వెళ్లడమే కాకుండా గురు బలం కూడా బాగుంటే చక్కగా నడవడానికి అవకాశం ఉంటుందట.. ఎవరైతే సీఎం గా అవుతారో వారి జాతకరీత్యా గ్రహ బలాలు ఆధారపడి ఉంటాయట.


అయితే వారి జాతకాలు, వారి యొక్క హస్త రేఖలను బట్టి సీఎం అయ్యే యోగ్యం ఎవరికి ఉందో తెలియాల్సి ఉంది అంటూ పండితులు తెలుపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఇబ్బందులు పెట్టినా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న సమస్యల పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుందట. అయితే పాడిపంటలు కూడా బాగా సమృద్ధి చెందుతాయని.. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగానే ఉంటుందంటూ తెలుపుతున్నారు. క్రోధినామ సంవత్సరం ఆధారంగా.. ఈ ఏడాది అంతా ప్రశాంతంగానే ఉంటుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఏడాది సీఎం అవుతారో వరుసగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికి అవకాశం ఉంటుందట.. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ రాహుల్ యొక్క జాతకాల ప్రకారం నరేంద్ర మోడీ  యొక్క జాతకం బాగుందని తెలుపుతున్నారు. రాహుల్ గాంధీకి కూడా తులా రాశి కావడం చేత రాహువు, కేతువు తప్పుకున్నారని.. ప్రతిపక్షంలో కూడా కీలకమైన పాత్రను వ్యవహరించడానికి రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: