ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఓటర్లను ఆకట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లినా జగన్ మద్దతుదారులే కనిపిస్తున్నారు. ఆమెను బహిరంగంగానే దారుణంగా విమర్శిస్తున్నారు. జగన్ బాగా పరిపాలన చేస్తున్నారని షర్మిల మాట్లాడుతుండగా బలంగా నినాదాలు చేస్తున్నారు. ఆమె అన్ని పర్యటనలకు జగన్ మద్దతుదారులే అంతరాయం కలిగిస్తున్నారు. అన్నతో కలిసి నడవాలని, ఎవరో మాట నమ్మి అన్నపై విమర్శలు చేయవద్దని హితవు కూడా పలుకుతున్నారు.

ఇటీవల కడప జిల్లా మైదుకూరు పర్యటన చేస్తున్నప్పుడు కూడా ఆమె ముందు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఒక యువకుడు అదే పనిగా జై జగన్ అంటూ నినాదాలు చేశాడు. అయితే ఎక్కడో జనాల్లో దాక్కొని అనడం కాదు, దమ్ముంటే నా ముందుకు వచ్చి మైక్ ముందు మాట్లాడుతూ జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పు అని అడిగారు షర్మిల. అయితే ఆ యువకుడు ఆమె సవాల్ ను స్వీకరించి ధైర్యంగా జగన్ ఐదేళ్ల పరిపాలనలో ఏం చేసారో, ఎందుకు ఓటేయాలో చెప్పాడు.

"జగన్ అన్న మా కోసం వచ్చినాడు, మా సమస్యలు విన్నాడు. సమస్యలు తీరుస్తానని అప్పుడు చెప్పాడు, చెప్పిన ప్రకారమే అన్ని హామీలు నెరవేర్చాడు. ఏపీలోని ప్రతి కుటుంబం సంక్షేమ పథకాలను పొందుతోంది. ఆయన మా కోసమే పుట్టినట్లు అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయన మాతోనే ఉంటాడు. మీలాగా పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేస్తానని అనరు. మీరు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఏపీకి వచ్చేసారు, ఇప్పుడు ఇక్కడ పోటీ అంటున్నారు. మాకు ఒక్క జగన్ తప్ప ఎవరూ అవసరం లేదు, మీరు కూడా జగన్‌తో కలిసి నడవండి అక్క" అని సదరు యువకుడు అన్నాడు.

ఆ యువకుడు అలా మాట్లాడుతుంటే షర్మిల షాక్ అయిపోయారు. ఇలాంటి పరిణామం ఊహించని ఆమె ఏం మాట్లాడాలో కూడా తెలియక సైలెంట్ అయిపోయారు. తర్వాత ఏదో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ దానికంటే ఈ యువకుడు మాట్లాడిన మాటలే బాగా హైలైట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: