•జగన్ జోలికొస్తే షర్మిల పని అంతే
•వై. ఎస్. కూతురిగా మాత్రమే అభిమానం
•కడపలో గెలిచేనా

(కడప - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి రోజున మైదుకూరు ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఉండగా.. ఒక చేదు అనుభవం ఎదురయ్యింది.. కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా వైఎస్ వివేక హత్యని హైలెట్ చేస్తూ న్యాయం జరగాలంటూ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.


ఒకవైపు న్యాయస్థానంలో విచారణ జరుగుతుంటే షర్మిల మాత్రం ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి హంతకుడు అంటూ పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీంతో వైఎస్ అభిమానులు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.. న్యాయస్థానం తేల్చిన తరువాతే ఇలాంటి ఆరోపణలు చేయాలని వాటికంటే ముందు తానే తీర్పు ఇవ్వడం పైన నిరసన తెలియజేస్తున్నారు.. ఈ సమయంలోనే దువ్వూరు ప్రచారంలో షర్మిలాకు ఎదురుదెబ్బ తగులుతోంది జై జగన్ అంటూ జనం నినదించడంతో అక్కడ షర్మిల ఉక్రోశం పట్టుకోలేకపోయింది..


దమ్ము ధైర్యం అంటే తన వద్దకు వచ్చి మాట్లాడాలంటూ షర్మిల అక్కడ సవాల్ విసిరుతోంది... అయితే అక్కడి ప్రజలు మాత్రం కేవలం వైయస్సార్ బిడ్డగా, సీఎం జగన్  చెల్లెలుగా ఆమెను ఇప్పటివరకు అభినందిస్తున్నారని.. అంతేతప్ప మరెవరైనా ఇలా మాట్లాడితే కడప ప్రజానీకం చూస్తూ ఊరుకోదని.. జగన్ పైకి ఎంత విమర్శించిన ఆమె ధైర్యం కూడా అతని చెల్లెలు అన్న కారణం తో ఎవరి ఏమనరనే అపోహలో ఉందని తెలుస్తోంది.. కేవలం దువ్వూరు ప్రాంతంలోనే షర్మిలాకు ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇది ట్రైలర్ మాత్రమే అని రాబోయే రోజుల్లో అడుగడుగున నిలదీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా మహిళలే ఆమెను నిలదీస్తారని కడప ప్రజలు తెలియజేస్తున్నారు. తెలంగాణలో నీ ఆటలు సాగక ఆంధ్రలోకి వచ్చావా అంటూ మొహం మీదే అడిగేస్తున్నారు.. ఇలా ఇప్పటికే షర్మిలాకు చాలా దెబ్బలు ఎదురయ్యాయి. ఇంతటి అవమానం భరిస్తూ ఇలా ప్రచారం చేయడం అవసరమా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: