- ఉగాది జాతకంలో కేసీఆర్ కు మరిన్ని షాకులు

- సొంత వాళ్లే ముంచేస్తారట

- అదొక్కటే కేసీఆర్ ను కాపాడుతుందట

- కేసీఆర్ కు యోగం రావాలంటే అప్పటివరకు ఆగాల్సిందేనట


    (తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )
నేటి నుంచే నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ క్రోధి నామ సంవత్సరంలో తమ భవితవ్యం ఎలా ఉంటుందో అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తికరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్లి ఇక తమ జాతకం చిట్టాని తెరిపించుకుంటున్నారు. అయితే మరోవైపు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అటు ప్రముఖ రాజకీయ నాయకులకు ఇక క్రోది నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని కలబరుస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న గులాబీ దళపతి కేసీఆర్ కి.. క్రోధీనామ సంవత్సరంలో జాతకం ఎలా ఉంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.


 వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కేసిఆర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష హోదా తోనే  సరిపెట్టుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడటంతో హస్తం పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టింది. ఇక అప్పటి నుంచి కూడా కెసిఆర్ కు ఇబ్బందులను తలెత్తుతూనే ఉన్నాయి. ఏకంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరినీ కూడా హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కన్ఫ్యూజన్ నెలకొంది. ఇలాంటి సమయంలో కనీసం కొత్త సంవత్సరంలో అయిన కేసీఆర్ కు కలిసి వస్తుందా.. ఆయన జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.


 1954 ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ జన్మించగా.. ఆయనది ఆశ్లేష నక్షత్రం. కర్కాటక రాశి. అయితే మే ఒకటవ తేదీ నుంచి ఈ రాశి వారికి బుద్ధి,సంతానం, ధనం, విద్యకు కారకుడైన గురుడు 11వ స్థానంలో ఉంటాడట. దీనివల్ల  మంచి ఫలితాలు సాధించే అవకాశం జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే అష్టమ శని వల్ల ఈసారి కెసిఆర్ కు అనేక కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అని అటు జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇక ఇలాంటి కష్టాల వల్ల కేసీఆర్ మానసికంగా కుంగుబాటుకు గురి అయ్యే అవకాశం కూడా ఉన్నాయట. అయితే కేతువు మూడు స్థానంలో ఉండడం వల్ల ఆయనకు దేవుడి పట్ల ఉన్న భక్తి ఇక ఆయనను కాపాడుతుందని చెబుతున్నారు పండితులు. అయితే ఆయన జాతకంలో గురువు మహర్దశలో ఉందట. దీంతో 2035 సెప్టెంబర్ వరకు ఆయనకు యోగం ఉంటుందని.. శని, రాహువు, గురువు స్థితిగతులు సరైన స్థానంలో లేకపోవడం వల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇక ఈ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఉంటుందట. అనారోగ్య, మానసిక అశాంతి లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. కేసిఆర్ ఏకంగా దగ్గరున్నవారు దూరం అవడం.. పక్కనే ఉన్నవారు కేసీఆర్ పతనాన్ని  కోరుకోవడం లాంటివి జరుగుతాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: