ఏపీలో రానున్న ఎన్నికల్లో కడప పార్లమెంట్ గెలుపు కోసం అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు షర్మిల జగన్ పైన తీవ్ర ద్వేషంతో అక్కడ పోటీ చేస్తుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.అధికారంలో అలాగే ఆస్తిలో వాటా కోసం పోటీ చేస్తుంది అని తెలుస్తుంది.తన తండ్రి దగ్గరనుండి రావాల్సిన ఆస్తి ఎలాగో వచ్చినప్పటికి తన అన్న జగన్ ఆస్తిలో కూడా వాటా కోసం కోరుకుంటున్నట్లుగా మరియు కుటుంబ పెత్తనం కోసం కూడా తనకే అధికారం ఉండాలి అనే విధంగా ఆమె ప్రవర్తిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది.

ఇంకా జగన్ విషయానికి వస్తే తనకి వ్యతిరేకంగా ఉన్న మాజీ మంత్రి, బాబాయ్ అయినా వివేకానంద రెడ్డినే దగ్గరికి రానివ్వలేదు.కడప ఎంపీ టికెట్ కోసం ఆయన బతిమిలాడిన ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు జగన్.ఆ రోజున టికెట్ ఇవ్వకపోయినా వివేకానంద రెడ్డి జగన్ పై ఇటువంటి దుర్భాషలు ఆడలేదు.వదిన విజయమ్మను లాగే జగన్ను షర్మిలలాగా మాత్రమే మాట్లాడలేదు వివేకానందరెడ్డి.మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్న చెల్లెల్ని జగన్ జీవితంలో అందరిస్తాడా..?అయితే కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి భారతి మాత్రం జగన్,షర్మిలను విమర్శన చేయకుండా చూస్తుంది అనేది వాస్తవం అని సమాచారం.

ఒకవేళ జగన్ గెలిస్తే షర్మిల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న..? కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఛీఫ్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం దగ్గరకు తీస్తుంది అనే విషయం షర్మిల ఆలోచించాలి.ఆమె ప్రచారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేయకుండా కేవలం తన నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభం ఎంటో ఆమెకే తెలియదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఆమె తన ప్రచారంలో వివేకానంద రెడ్డి కేసు గూర్చి మాట్లాడుతూ ఇతర పరిపాలన గూర్చి మాట్లాడుతుంది కానీ టిడీపీ మాత్రమే కేవలం వివేకానందరెడ్డి కేసు పై మాత్రమే దాన్ని హైలేట్ చేయటం అనేది గమనార్హం దాన్ని ఆమె అర్ధం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: