ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎన్నికల హడావుడి మొదలవడంతో అధికార, ప్రతి పక్ష పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే సీటు దక్కని నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో వున్నారు..ప్రాణం పోయిన పార్టీని వీడేది లేదు అంటూ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులే రేపు వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు.. దీనితో ప్రస్తుత రాజకీయాలు ప్రతి రోజు ఒక మలుపు తిరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నేడు క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్బంగా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వేదపండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం చేశారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు..తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.5 వేలు కాదు.. ఏకంగా రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ఇంతకు ముందే చెప్పామని ఆయన వెల్లడించారు. ప్రజలకు సేవచేస్తే తాము ఎప్పటికి వాలంటీర్లకు అండగా ఉంటామని ఆయన వివరించారు.మనకు కొత్త ఉత్సాహం అందించే పండగ ఉగాది.ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి. ప్రజలకు సంక్షేమం ఉండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు ఇలా అన్నీ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయి. అశాంతి, అభద్రతాభావం మాత్రమే కనిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రానికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని ఎంతో సంకల్పంతో ఉందని చంద్రబాబు అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: