సాధారణంగా రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు తమ అభ్యర్థి  పార్టీలకు ఎన్నోసార్లు సవాళ్లు విసరడం చేస్తూ ఉంటారు  ఏకంగా పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని.. ఇక మీ పార్టీ అభ్యర్థులను ఎక్కడ గెలవనివ్వను అంటూ ఇక సవాలు విసరడం చేస్తూ ఉంటారు. కానీ తర్వాత కాలంలో ఇలాంటి శపథాలను అందరూ మరిచిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఏకంగా చెప్పింది చేసి చూపించాడు. కెసిఆర్ తో ఏదైతే మాటను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారో.. ఇక ఇప్పుడు అది చేసి చూపించి పంతం నెగ్గించుకున్నారు.



 అంతేకాదు ఇక గులాబీ దళపతి కేసీఆర్ పై ప్రతీకారం కూడా తీర్చుకున్నారు. అవును ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తాను అంటూ చెప్పిన మంత్రి పొంగులేటి.. ఇక ఇప్పుడు చెప్పింది నిజం చేసి చూపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేర్చుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం ఇటీవలే జరిగిన సభలో ఇక సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు.


 ఇలా కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఫై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక్క బిఆర్ఎస్ లీడర్ ను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ పొంగులేటి శపథం చేశారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అక్కడ ఉన్న పది నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ గెలిచింది. ఒకటేమో కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సిపిఐ గెలిచింది. ఒక భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. ఇక ఇప్పుడు ఆ ఎమ్మెల్యేను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుని తన శబ్దాన్ని నిలబెట్టుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి: