ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకి సరికొత్తగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వాలంటరీ వ్యవస్థ పైన నానా హంగామా చేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాలంటరీలను కూడా తీసివేసేలా ఈసీకి లేఖలు రాయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్లేట్ మారుస్తూ తాజాగా తాము అధికారంలోకి రాగానే వాలంటరీలకు గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామంటూ టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు.. ఈ విషయం పైన..YSRCP ట్విట్టర్ లో స్పందించడం జరిగింది.


వాలంటరీ వ్యవస్థను ఒక శక్తిగా గుర్తించినందుకు అటు చంద్రబాబుకు,  మోడీ, పవన్ కు సైతం థాంక్స్ చెప్పారు.. ఇది జగనన్న పాలనకు ఒక నిదర్శనమని.. కచ్చితంగా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఉండాలని.. వాలంటీర్లు ఎవరు కూడా భయపడవద్దండి .జూన్ 4వ తేదీన కచ్చితంగా సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మళ్ళీ తిరిగి వాలంటరీ వ్యవస్థను సైతం పునరుద్దించేలా చేస్తారు అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే వాలంటరీలకు రూ.10, 000 జీతం పెంచుతామంటూ ఉగాది రోజున హామీ ఇచ్చారు.


గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాలంటరీలను తిట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా రూ .10,000 జీతం చేస్తామంటూ.. వాలంటరీలను కొనసాగిస్తామని.. ప్రజలకి సేవ చేసే వాలంటరీలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతానికి వాలంటరీలకు అధికార పార్టీ 5000 రూపాయల  గౌరవ వేతనం ఇస్తున్నారు.


ఇప్పటివరకు అటు టిడిపి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి నిన్నటి రోజున రద్దుచేసి మరి తిరిగి సరికొత్త మేనిఫెస్టో తో వస్తానంటూ వెల్లడించారు చంద్రబాబు.. ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలనే విషయం పైన అటు ప్రజలకే వదిలేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మొత్తం కూడా మెనిఫెస్టో మీదే ఆధారపడింది.. ఎవరి మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటుందో.. గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: