వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా?  ఎన్నిక‌లకు స‌మ‌యం ముంచుకువ‌చ్చిన వేళ‌.. ప్ర‌స్తుత స‌మ‌యానికి అనుకూలంగా మార్చుల‌కు సీఎం జ‌గ‌న్ శ్రీకారం చుడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కీల‌క‌మైన అభ్య‌ర్థుల‌ను మార్చుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. తాజాగా 24 గంట‌లు కూడా కాకుండానే పార్టీ తీర్థం పుచ్చుకున్న పోతిన మ‌హేష్‌కు వైసీపీ టికెట్ దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

అది కూడా విజ‌య‌వాడ వెస్ట్ టికెట్ అని అంటున్నారు. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున ఆసిఫ్ అనే ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చారు. ఆయ‌న ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు. ఈయ‌న మాజీ కార్పొరేట‌ర్‌. అయితే.. ఇప్పుడు ఈయ‌న ప్లేస్‌ను పోతిన‌తో భ‌ర్తీ చేసి, ఇక్క‌డ టీడీపీ-జన‌సేన‌-బీజేపీ కూట‌మి అభ్య‌ర్తి సుజ‌నా చౌద‌రికి చెక్ పెట్టాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. మైనారిటీ వ‌ర్గానికి టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే స‌రికాద‌నే వాద‌న కూడావినిపిస్తోంది.

ఇక‌, గుంటూరులో మార్పులు ఖాయ‌మ‌నే వాద‌న నాలుగు రోజులుగా వినిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ సీటు నుంచి పోటీలో ఉన్న మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ని ఆ సీటు నుంచి త‌ప్పించి.. ఏకంగా గుంటూరు ఎంపీ స్థానానికి బ‌దిలీ చేయ‌డం ద్వారా మెజారిటీగా ఉన్నబీసీల ఓటు బ్యాంకును నియోజ‌క‌వ‌ర్గంలో గుండుగు త్త‌గా రాబ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా మైల‌వ‌రంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్క‌డ స‌న్యాల తిరుప‌తిరావు యాద‌వ్ అనే బీసీకి టికెట్ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఈ టికెట్‌ను మంత్రి జోగి ర‌మేష్‌కు కేటాయిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త వానికి  ఈయ‌న‌కు పెన‌మ‌లూరు టికెట్ ఇచ్చారు. కానీ, జోగి ర‌మేష్.. మైల‌వ‌రం టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతు న్నారు. ఈ క్ర‌మంలో పెన‌మ‌లూరు నుంచి ఆయ‌న‌ను మైల‌వ‌రం మారుస్తున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, కీల‌క‌మైన క‌డ‌ప ఎంపీ స్థానంలోనూ మార్పులు చేస్త‌న్నారు. ఇక్క‌డ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బ‌రిలో ఉండ‌గా.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కు బంధువు, ప్ర‌ముఖ డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్ రెడ్డికి అవ‌కాశం ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: