పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న చెందంగా.. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు వాడి వేడిగా మారిపోయాయ్. ఎందుకంటే గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలకు కూడా పావులు కదూపుతూ ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనసేనపార్టీతో పాటు అటు బిజెపి పార్టీని పొత్తుగా చేర్చుకొని ఇక సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అటు వైసిపి మాత్రం ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది.


 అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్ ను గద్దే తింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందుకోసం తనను తాను తక్కువ చేసుకుని కేవలం 21 స్థానాలలో మాత్రమే పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జగన్ పై వ్యతిరేకత తీసుకురావడమే కాకుండా.. బిజెపి నాయకత్వం ద్వారా అధికార యంత్రంగాన్ని జగన్ విషయంలో కంట్రోల్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇలాంటి స్ట్రాటజీతో పవన్ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం  ఇలా 21 స్థానాలలో పోటీ చేయడమే కాదు ఇందులో 11 స్థానాలు బయట నుంచి పార్టీలో కొత్తగా చేరిన వారిగా ఇవ్వడం గమనార్హం. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీని నిలబెడుతూ వచ్చిన నేతలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య సీఎం జగన్ రివర్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ సత్తా చాటలేని విధంగా.. ఇక ఆ పార్టీని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అయితే ఇప్పటికే జనసేన పార్టీకి ఉంది అంతంత మాత్రం క్యాడరే.. ఇప్పుడు ఆయా నియోజకవర్గాలలో ఉన్న కీలక నేతలు వైసీపీలో చేర్చుకుంటే.. జనసేనకు బిగ్ షాక్ తప్పదు. ఇప్పటికే పవన్ బయట వాళ్లకి టికెట్లు ఇవ్వడంతో.. మొన్నటి వరకు జనసేన పార్టీ కోసం ఎంతగానో పాటుపడిన నేతలందరూ.. ఇప్పుడు అసంతృప్తితో   వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల పోతిన మహేష్ కూడా వైసిపి గూటికి చేరుకున్నారు.  పోతిన మహేష్ తో కలిపి ఇప్పటివరకు ఏకంగా ఆరు నియోజకవర్గాలకు చెందిన జనసేన ఇన్చార్జిలను అటు వైసిపి తమ పార్టీలో చేర్చుకుంది. ఇలా జనసేన పార్టీ నుంచి ఎవరు వచ్చినా కాదనుకున్న ఇక జగన్ కండువా కప్పేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న జగన్.. వైసీపీ పార్టీలోకి ఆహ్వానించిన జనసేన నేతలతోనే ఇక పవన్ వైఖరిని విమర్శింప చేసి.. పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నెగెటివిటీ వచ్చేలా చేయాలని అటు సీఎం జగన్ ప్లాన్ వేసాడట. ఈ క్రమంలోనే ఇప్పటికే పోతిన మహేష్ జనసేనను వదిలి వైసీపీలో చేరగా ఇక రానున్న రోజుల్లో మరి కొంతమంది నేతలు కూడా వైసిపి పార్టీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: