దేశ రాజకీయాలు ఓకేత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో ఎత్తు అనే విధంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు చాలా చురుకుగా ఆలోచించి  నాయకులను ఎన్నిక చేసుకుంటారు. పేరున్న నాయకులను  ఆదరిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు..  అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కుల సామాజిక వర్గాలపై ఆధారపడే  పార్టీలు టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి. చాలావరకు కాపు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడ రాణిస్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం  పార్టీలు కాస్త రివర్స్ గేర్ వేశాయి.  ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నాయకులకు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విడదల రజిని.ఈమె చిలుకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఈమెకు ప్రత్యర్థిగా   గల్లా మాధవి పోటీ చేస్తుంది. ఈ విధంగా ఇద్దరు నేతలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారే. మరి ఈ ఇద్దరిలో గుంటూరు ప్రజలు ఎవరిని ఆదరిస్తారు.? ఎవరిని ఇంటికి పంపుతారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గుంటూరు పశ్చిమ:
ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే  గుంటూరు వెస్ట్ పేరు మార్మోగిపోతోంది. ఈ నియోజకవర్గం టిడిపి కంచుకోట అని చెప్పవచ్చు. అలాంటి కంచుకోటను మోసం చేసి 2019లో  టిడిపి నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్ రావు వైసిపిలోకి వెళ్లిపోయారు. వైసీపీ నుంచి విడదల రజిని, టిడిపి నుంచి గల్లా మాధవి పోటీ చేస్తుంది.  ఈ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే. మాధవి రజక సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అయితే, విడదల రజిని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ ఇద్దరు నేతలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు.  ఇందులో మాధవి భర్త రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే విడదల రజని భర్త కుమారస్వామి  కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విధంగా 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసినటువంటి విడదల రజిని ఓవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను వాడుకుంటూనే, మరోవైపు భర్త సామాజిక వర్గమైన కాపు ఓట్లను కూడా తనవైపు తిప్పుకుంది. ఈ విధంగా కుల ప్రాతిపదిక  ఈక్వేషన్ వర్కౌట్ చేసి  అక్కడ ఘన విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల సమయానికి వచ్చేసరికి  చిలకలూరిపేటలో ఆమెకు సర్వేల్లో కాస్త వ్యతిరేక పవనాలు వీచడంతో,  గుంటూరు వెస్ట్ కు ట్రాన్స్ఫర్ చేశారు సీఎం జగన్. ఇక్కడ కూడా విడదల రజని  క్యాస్ట్ ఈక్వేషన్ వర్కౌట్ చేయాలని అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని నెలల నుంచి గుంటూరు పశ్చిమలో ప్రచారాన్ని మొదలుపెట్టి అక్కడ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది.  ఈమెను ఢీ కొట్టాలి అంటే టిడిపి నుంచి కూడా కుల, ఆర్థిక బలం ఉండే నేతను బరిలో దించాలని ఆలోచన చేసి  చంద్రబాబు గల్లా మాధవికి టికెట్ ఖరారు చేశారు. దీంతో అక్కడ గట్టి పోటీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

ఎవరి బలం ఎంత:
ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు, బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 65 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి 12 %, కాపుకు 12 %, ఎస్సీ 11%, ముస్లిం 9% , బ్రాహ్మణులు 9% శాతం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 7% ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం కాపు, బీసీ ఓట్లు కలిపి 50వేల ఓట్లకు పైగా ఉన్నాయి. ఈ ఈక్వేషన్ పరిగణలోకి తీసుకున్న వైయస్సార్ హై కమాండ్  రజినిని గుంటూరు పశ్చిమకి పంపింది.  రజిని కూడా భర్త కుమారస్వామి వర్గానికి చెందిన ఓట్లను మరియు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను పూర్తిస్థాయిలో రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే తరుణంలో  మాధవి కూడా కమ్మ, బీసీ ఓట్లను  రాబట్టడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇద్దరి బలబలాలు సమానంగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: