- ప్రేమ వివాహంతో క‌లిసొచ్చిన పొలిటిక‌ల్ ఎంట్రీ
- భ‌ర్త కాపు కావ‌డంతోనే పిలిచి టిక్కెట్ ఇచ్చిన జ‌గ‌న్‌
- కొలిక‌పూడిని ప‌క్క‌న పెట్టేసి తిరువూరు సీటిచ్చే యోచ‌న‌లో చంద్ర‌బాబు


( అమరావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఉండవల్లి శ్రీదేవి.. వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా తన స్వరం వినిపించిన ఆమె రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో డాక్టర్ గా ఉండే శ్రీదేవికి వైసీపీ నుంచి అనూహ్యంగా తాడికొండ అసెంబ్లీ సీటు దక్కింది. రాజధాని అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండలో ఆమె తెలుగుదేశం అభ్యర్థిని ఓడించి సంచలనం క్రియేట్ చేశారు. ఎంతోమంది తాడికొండ వైసీపీ సీటు కోసం ప్రయత్నించిన జగన్ పట్టుబట్టి మరి ఉండవల్లి శ్రీదేవికి సీటు ఇవ్వడానికి ప్ర‌ధాన కార‌ణం డబుల్ క్యాస్ట్ ఈక్వేషన్ అని చెప్పాలి.


ఉండవెల్లి శ్రీదేవి భర్త శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. శ్రీదేవి మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన మహిళ. వీరిద్దరూ డాక్టర్లు కావడంతో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో హాస్పిటల్స్ పెట్టి ఆర్థికంగా సెట్టిల్ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ శ్రీదేవి భ‌ర్త కావ‌డంతో నియోజకవర్గంలో ఉన్న కాపులలో మెజార్టీ ఓట్లు శ్రీదేవికి పడతాయని.. అలా శ్రీదేవి గెలుస్తుందని వైసీపీ అంచనాలు వేసుకుంది. అందరూ అనుకున్నట్టుగానే కాపు సామాజిక‌ వర్గం నుంచి కూడా నియోజకవర్గంలో శ్రీదేవికి మద్దతు లభించింది.


శ్రీదేవి అమరావతి రాజధాని ఏరియాలో టీడీపీ ప్రపంచాన్ని తట్టుకుని 4000 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక గెలిచిన అనంతరం ఆమె వైసీపీలో ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో ముందుకు వెళ్లారు. చివరకు జగన్ సీటు ఇవ్వనని చెప్పేశారు. అందుకే ఆమె ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన పంచుమర్తి అనురాధకు క్రాస్ ఓట్‌ వేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.
టీడీపీలో తనకు బాపట్ల పార్లమెంటు సీటు వస్తుందని శ్రీదేవి ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు. అయితే శ్రీదేవికి ఇప్పుడు మళ్లీ నక్క తోక తొక్కినట్టు లక్కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. తిరువూరు నుంచి అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన కొలికిపూడి శ్రీనివాసరావుకు చంద్రబాబు సీటు
కేటాయించారు.


ఇప్పుడు శ్రీనివాసరావు అభ్యర్థిత్వం విషయంలో లోకల్ టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేయటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీదేవికి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. తిరువూరులో కూడా కాపు సామాజిక వర్గం.. కమ్మ‌సామాజిక‌ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇటు జనసేన సపోర్ట్ ఉండడంతో కాపుల మద్దతు ఎలాగూ ఉంటుంది. పైగా శ్రీదేవి భర్త శ్రీధర్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈక్వేషన్ల పరంగా తిరువూరులో శ్రీదేవి సింపుల్గా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: