రాజకీయాలలో సక్సెస్ కావాలంటే కష్టానికి ఆవగింజంత అదృష్టం కూడా తోడు కావాలి. కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు అన్నాదమ్ములు 2019 ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి సంచలనం సృష్టించారు. ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలవడంతో అరుదైన రికార్డ్ ను సైతం ఖాతాలో వేసుకున్నారు. కర్నూలుకు చెందిన బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలకు 2019లో వైసీపీ తరపున టికెట్లు దక్కాయి.
 
ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నియోజకవర్గం నుంచి సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేయగా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అన్నాదమ్ములు ఎన్నికల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురు అన్నాదమ్ములకు వైసీపీ నుంచి టికెట్లు దక్కాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికల్లో ఈ అన్నాదమ్ములు పోటీ చేయనున్నారు.
 
2024 ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ ముగ్గురు అన్నాదమ్ములు 2019 మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫీలవుతున్నారు. సర్వేలలో సైతం ఈ ముగ్గురు అన్నాదమ్ములకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నేతలు రెండు జిల్లాల రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం కూడా సంచలనం అనే చెప్పాలి. ఈ ముగ్గురు అన్నాదమ్ములు పోటీ చేసే నియోజకవర్గాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
 
వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్లస్ అయ్యాయి. మంత్రాలాయంలో టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తుండగా ఆదోని నుంచి కూటమి తరపున పార్థసారథి గుంతకల్లు నుంచి టీడీపీ తరపున గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నారు. గుంతకల్లులో తెలుగుదేశం వీక్ గా ఉండటమే వెంకట్రామిరెడ్డికి ప్లస్ కానుందని స్థానికులు చెబుతున్నారు. బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: