- అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నుంచి మంత్రి బూడి ముత్యాల‌నాయుడు
- మాడుగుల నుంచి కూతురు అనూరాధ పోటీ..!
- కూతురుకు రాజ‌కీయ వార‌స‌త్వంపై మొద‌టి, రెండో భార్య కొడుకులిద్ద‌రు తండ్రిపై గుర్రు..


( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
వైసీపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ మామూలుగా లేవు. జగన్ ఒక ఫ్యామిలీకి ఒకే సీటు అని చెప్పినా చాలా ఫ్యామిలీలకి రెండు లేదా అంతకు మించి సీట్లు ఇచ్చారు. బొత్స‌ ఫ్యామిలీ లో నలుగురు ఐదుగురు పోటీ చేస్తున్నారు. గుంతకల్లు, ఆదో,ని మంత్రాలయంలో రెడ్డి బ్రదర్స్ ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఇక వైయస్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల.. వైసీపీ నుంచి జగన్, అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీలో మిథున్ రెడ్డి తో పాటు పెద్దిరెడ్డి ఆయన సోదరుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు ఆయన కుమార్తె అనురాధ ఇద్దరు ఒకరు ఎంపీగా.. మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.


ముత్యాల నాయుడు విషయానికి వస్తే ఆయన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. జడ్పిటిసి గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు మంత్రి.. ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లింది. 2014 ఎన్నికలలో మాడుగుల నుంచి వైసీపీ టికెట్ దక్కించుకున్న ముత్యాల నాయుడు ఆ ఎన్నికలలో కేవలం 500 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో మరోసారి మాడుగుల నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. స్వతహాగా మృదుస్వభావి అన్న పేరు ముత్యాల నాయుడుకు ఉంది.


ఈ క్రమంలోనే మంత్రివర్గ ప్రక్షాళనలో జగన్ ఆయనకు మంత్రి పదవితో పాటు కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే ఆయన రాజకీయ వారసత్వం విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ముత్యాల నాయుడుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య కుమార్తె ఈర్ల అనురాధను తన రాజకీయ వారసురాలుగా ఆయన ప్రకటించుకున్నారు. దీనిపై ముత్యాల నాయుడు పెద్ద భార్య కుమారుడు.. ఇటు రెండో భార్య కుమారుడు ఇద్దరూ తండ్రిపై గరం గరం లాడుతున్నారు. కొడుకులుగా ఉన్న త‌మ‌ ఇద్దరినీ కాదని పెళ్లి చేసుకునే పుట్టింటికి వెళ్లిన తమ చెల్లిని రాజకీయ వార‌సురాలిగా ప్రకటించడంతోపాటు ఆమెకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేయడంతో రగిలిపోతున్నారు.


తాము ఇద్దరం కొడుకులం ఉండగా.. తమను కాదని తమ సోదరికి ఎలా ? ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ముత్యాల నాయుడు పెద్ద భార్య కుమారుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా మాడుగులలో తండ్రి త‌ర‌పున‌ రాజకీయం చ‌క్కబెడుతూ వస్తున్నారు. ముత్యాల నాయుడు ను జగన్ అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయన కోరుకున్నట్టుగా మాడుగుల అసెంబ్లీ టికెట్ ను ఆయన కుమార్తె అనురాధకు కేటాయించడంతో ఇప్పుడు ముత్యాల నాయుడు కుటుంబంలో పొలిటికల్ చిచ్చు రేగినట్టు అయింది.


మరి ఈ పొలిటికల్ ఎలా సర్దుకుంటుంది ? అన్నది చూడాలి. అలాగే ఇక్కడ మరో టాపిక్ కూడా వినిపిస్తోంది. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ సీఎం రమేష్ ను ఆర్థికంగా తట్టుకోలేరని... అందుకనే పార్ల‌మెంటు ప‌రిధిలో బ‌లంగా ఉన్న గ‌వ‌ర సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా మరో బలమైన నేతను అనకాపల్లి పార్లమెంటు నుంచి బరిలోకి దింపి ముత్యాలనాయుడుకు తిరిగి మాడుగుల టిక్కెట్ ఇస్తారని కూడా అంటున్నారు. మరి ముత్యాల‌నాయుడు ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఉంటాయా ?  లేదా ? ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: