ఎన్నికలు దగ్గర పడ్డాయి అంటే అనేక సంస్థలు సర్వేలను నిర్వహిస్తూ ఉంటాయి. అందులో కొన్ని సర్వేలను జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్ని సర్వేలకు మాత్రం ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడానికి ప్రధాన కారణం గతంలో ఆ సంస్థలు చేసిన సర్వేలు కనుక ఎక్కువ శాతం సక్సెస్ అయినట్లు అయితే ఆ సంస్థల నుండి వచ్చే సర్వేల కోసం జనాలు ఎదురు చూస్తూ కూడా ఉంటారు. ఇక తెలుగు ప్రజలు కూడా ఎలక్షన్ల ముందు సర్వేలను బాగా నమ్ముతూ ఉంటారు. ఎక్కువ శాతం ఈ సర్వేలు చెప్పిన విషయాలు నిజం అయినప్పటికీ కొన్ని సార్లు మాత్రం ఈ సర్వేలో బొక్క బోర్లా పడుతూ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన సర్వేల సంస్థలలో నాగన్న సర్వే ఒకటి. ఈయన గతంలో చాలా ఎన్నికలకు సర్వేలను నిర్వహించారు. అందులో ఎక్కువ శాతం సర్వేలు మంచి సక్సెస్ను సాధించాయి. ఒకటి, రెండు సార్లు మాత్రం ఈయన సర్వేలు ఫెయిల్ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే. ఇందుకోసం నాగన్న భారీ ఎత్తున సర్వేను నిర్వహించారు.

అందుకు సంబంధించిన డేటాను తాజాగా విడుదల చేశారు. ముఖ్యంగా అందరూ కోరుకునేది ఒకే అంశం నెక్స్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సీఎం ఎవరు అవుతారు అని..? దానిపై కూడా నాగన్న సర్వే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం ఎవరు అయితే బాగుంటుంది అనే విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది అనే వాళ్ళు 51.24 శాతం మంది ఉంటే... చంద్రబాబు నాయుడు గారికి 37.12%, పవన్ కళ్యాణ్ ను కోరుకుంటున్న వారు 6.08%, షర్మిల 1.84 శాతం , లోకేష్ 1.07 శాతం , ఇతరులు ముఖ్యమంత్రి కావాలి అని 2.66 మంది కోరుకుంటున్నారు.

ఈ లెక్కల బట్టి చూస్తే క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ కి నెక్స్ట్ సీఎం జగన్ అని నాగన్న సర్వే చెప్పేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ కంటే కూడా మూడు పార్టీలు కలిసి పొత్తుగా పోటీ చేస్తున్న కూటమి వైపే జనాలు ఎక్కువగా నిలుస్తారు అని అంతా అనుకున్నారు. కానీ సర్వే జగన్ సీఎం అని ప్రకటించింది. దీనికి ప్రధానంగా కనబడుతున్న కారణాలు... పొత్తులో భాగంగా కొన్ని గెలవాల్సిన సీట్లను టీడీపీ, జనసేన, బీజేపీ కోల్పోయాయి. అలాగే సీట్లు దక్కని ఎంతోమంది వైసీపీ పార్టీలోకి వెళ్లడం... అలాగే కొంతమంది రెబల్స్ లా పోటీ చేయడం. ఇలా అనేక కారణాల వల్ల కూటమి ప్రభావం తగ్గి వైసీపీ క్రేజ్ పెరిగినట్లు కనబడుతుంది. ఇలాంటి అనేక కారణాలవల్ల ప్రజలు కూటమి వైపు కాకుండా వైసీపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మరి నాగన్న సర్వే ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: