ప్రస్తుతం అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి మాములుగా లేదనే చెప్పాలి. పార్టీల ప్రచారాల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మే 13 తేదీన… రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.మరీ ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంటే ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని విధంగా షాక్ తగిలింది.శనివారం నాడు రాత్రి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్లతో దాడి చేశారు కొంతమంది రౌడీలు. పక్క ప్లాన్ తో విజయవాడలో… జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసినట్టు పూర్తిగా అర్థం అవుతుంది. నిన్న బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సింగనూరు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. అయితే ఆయన ప్రచారం మొదలుపెట్టగానే.. పలుమార్లు ఆ ఏరియాలో కరెంటు కట్ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజే అలా కరెంట్ కట్ అయిందని స్థానికులు చెబుతున్నారు.కొంతమంది ఆకతాయి రౌడీలు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి తలపై రాళ్లతో కొట్టడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పై భాగంలో తీవ్రంగా గాయం అయింది.


అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా తీవ్ర గాయం అయింది. దీంతో వారిద్దరూ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ గాయం నేపథ్యంలో ఈరోజు బస్సు యాత్ర కూడా క్యాన్సల్ చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ పని చేశారని మొదటి నుంచి వైసీపీ చెబుతూనే ఉంది.రీసెంట్ గానే నారా లోకేష్… దాడులు చేస్తామంటూ హెచ్చరించడం జరిగింది. పైగా ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగింది. దీంతో టీడీపీ పార్టీ ఈ దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఇది జరిగిందని జనాల్లోకి వైసీపీ తీసుకు వెళుతోంది. అయితే జనాలు కూడా పాపం అంటూ జగన్ మోహన్ రెడ్డి పై ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికి సింపతీ వర్క్ ఔట్ అయ్యింది. ఎన్నికల కంటే ముందు జగన్కు ఇలా గాయం కావడం వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపితున్నాయి.  175 సీట్లకు… ఈ గాయం మంచి బూస్ట్ అవుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రాయి దెబ్బతో జగన్ మళ్ళీ సీఎం అయ్యినా అవ్వొచ్చని అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: