ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం,దివంగత నేత వైఎస్సార్ ఎంత పాపులారో అప్పట్లో ఆయన పక్కన ఉండే సూరీడు కూడా పాపులర్. వైఎస్సార్ హయాంలో ఆయనకు నీడలా ఉండేవారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత సూరీడు జగన్ పక్కన ఉంటారని అందరూ భావించారు.కానీ జగన్ పక్కన మరోక యువకుడు ఎక్కువగా కనబడుతున్నాడు.ఆయన ఎన్నికల ప్రచార సభలో జగన్ అవసరమైన స్పీచ్ పేపర్లను అందిస్తూ ఆయన పక్కనే కనబడుతున్నాడు.దాంతో జగన్ పక్కనున్న ఆ వ్యక్తి ఎవరా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.ఆయన పేరు నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ ఆయన జగన్ వ్యక్తిగత కార్యదర్శి. ఆయన జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయనతోపాటే ఉంటున్నారు.నమ్మకస్తుడిగా పనిచేయడంతో ఆయన్ను తన పీఏగా సెలక్ట్ చేసుకున్నారు. కేఎన్ఆర్ కు జగన్ సైతం ప్రాధాన్యత ఇస్తారట. జగన్ సొంత జిల్లా కడపకు చెందినవాడే. జగన్ దగ్గర జాయిన్ అవ్వకముందు పలు మీడియా సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. 

జగన్ ఎంపీగా బాధ్యతలు చేపట్టాక దగ్గరై మన్ననలు పొంది పీఏగా అపాయింట్ అయినట్లు తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు కేఎన్ఆర్. జగన్ బాగోగులన్నీ ఆయన చూసుకున్నారని జగన్ మనసును బట్టి వర్క్ చేయడం కేఎన్ఆర్ స్పెషల్.అందుకే  తొందరగా జగన్ కు సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా మారాడు. జగన్ వ్యవహారాలను చక్కబెట్టడం రోజూవారీ వ్యవహారాలను జగ్రత్తగా చూసుకుంటూ జగన్ కు కుటుంబ సభ్యుడిలా మారాడని అంటుంటారు. అందుకే జగన్ మిస్ అయ్యే కొన్ని కార్యక్రమాలకు తన ప్రతినిధిగా కేఎన్ఆర్ ను పంపుతారని వైసీపీ వర్గాల టాక్. సాధారణంగా జగన్ ఎవరిని పెద్దగా నమ్మరని ఒకవేళ నమ్మితే మాత్రం వాళ్ళకోసం ఏమైనా చేస్తారని సన్నిహితులు అంటుంటారు. సీఎం అవ్వకముందు వైజాగ్ విమానాశ్రయంలో జగన్ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఈ గొడవ పెద్ద వివాదానికి కూడా దారి తీసింది. అయితే ఆ గొడవ కేఎన్ఆర్ గురించేనని తర్వాత తెలిసింది. అప్పట్లో జగన్ మీద దాడి జరిగిన సమయంలో నాగేశ్వర్ రెడ్డి పక్కనే ఉన్నారు. అయితే కేఎన్ఆర్ కు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను చూసి చాలామంది నేతలు జగన్ ను కలిసేందుకు ముందుగా కేఎన్ఆర్ ను సంప్రదిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: