ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది పార్టీ అధినేతలపై రాళ్ల యుద్ధం మొదలైంది. నిన్న జగన్ పై రాయితో జరిగిన దాడి మరువకముందే నేడు జనసేన అధినేత పవన్కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరిగింది.దాంతో రాజకీయాలు ఇంకా వేడెక్కుతున్నాయి.నిన్న విజయవాడలో సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరేయడంతో ఆయన ఎడమ కన్నుకు గాయం అయింది.అయితే దీనిపై వైసీపీ నేతలు టీడీపీపై విరుచుకుపడుతున్నారు.ఇలాంటి పని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కావాలనే చేయించారాని అంటున్నారు.ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయంసంగా మారింది.

అయితే ఈ సంఘటన మరువకముందే నేడు తెనాలిలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉండగా ఇలాంటి దాడి ఆయనపై కూడా జరిగింది. అయితే ఆ రాయి పవన్ కు తగలక పోవడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. కాకపోతే ఆ రాయి విసిరిన వాడిని జనసేన నేతలు పట్టుకొని పోలీస్ లకు అప్పగించారు.అయితే జగన్ విషయంలో మాత్రం ఎవరు కొట్టారు అనేది ఒక ప్రశ్నర్ధకంగా మిగిలింది.

అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణపై రాయి విసిరింది మాత్రం వైసీపీ కార్యకర్తలేనని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై దాడి చేసింది టీడీపీ, జనసేన నేతలు అని వైసీపీ ఆరోపించడంపై తగు నిర్ధారణలు చూపించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కేవలం జగన్ పైదాడి జరిగిందని దానికి రివర్స్ గా పవన్ పై దాడి చేసారని జనసైనికులు మండిపడుతున్నారు.ఈ విషయమై ఇరువురి కార్యకర్తల మధ్య ఇలాంటి గోడవ అనేది ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అధినేతలకి ప్రచారం అంటేనే భయంగా మారింది. ఎప్పుడు ఎమవుతుందో తెలియక ఎటు నుండి ఏ రాయి వస్తుందో ముందే ఊహించలేకపోతున్నారు.దీన్ని గమనించిన టీడీపీ నేతలు తర్వాత తమ అధినేత చంద్రబాబు పై ఎక్కడ ఇలాంటి ఘటన జరుగుతుందో అనే భయంతో ఉన్నారు.వైసీపీ నేతలు కేవలం ఊహగానంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చూస్తుంటే నెక్స్ట్ టార్గెట్ టీడీపీ అనేలా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు పూర్తిగా భద్రతా చర్యలు పెంచలంటూ ఈసీ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: