ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.. మే 13 న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్ సభ ఎన్నికలు రెండు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది... దీనితో ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షాలు అయిన తెలుగుదేశం, బిజెపి,  జనసేన ఉమ్మడి కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.కూటమి సైతం తమ అభ్యర్థులను ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో రాజకీయ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ కూటమి అభ్యర్థి గా మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.. ఈ సారి వీరిద్దరి మధ్య పోరు హోరా హోరిగా సాగనుంది. 

అయితే తాజాగా పొదలకూరు మండలం పార్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సర్వేపల్లి కి నాన్ లోకల్ అని., అయితే మంత్రి కాకాణి తాను లోకల్ అంటూ చెబుతు ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగానే తాను నాన్ లోకల్ అయితే పోటీ చేయకూడదా.. అంటూనే సైదాపురంలో జడ్పిటిసిగా మంత్రి కాకాణి పోటీ చేశారని గుర్తు చేశాడు. ఇకపోతే సైదాపురం కాకాణి లోకలా అంటూ ప్రశ్నించాడు. దీంతో పాటు నెల్లూరు రూరల్ లో పోటీ చేసే ఆదాల ప్రభాకర్ రెడ్డి,కోవూరు లో పోటీ చేసే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు ఉదయగిరిలో పోటీ చేసే మేకపాటి రాజగోపాల్ రెడ్డి అందరూ కూడా నాన్ లోకల్ వ్యక్తులే అని ఆయన చెప్పుకొచ్చారు.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి లోకల్ లేదా నాన్ లోకల్ అనేది ముఖ్యం కాదు.. తనని గెలిపిస్తే ప్రజలకు ఏవిధంగా అండగా ఉంటానో భరోసా ఇవ్వడం..వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసింది.. బలహీన వర్గాల వారికీ తీరని అన్యాయం చేసిందని సోమిరెడ్డి తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: