ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ముమ్మాటికీ ఇది కూటమి నేతల పనే అంటూ వైసీపీ విమర్శిస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం దీనిని కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అంటూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.


గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా, బాబాయ్ హత్యతో జగన్ ఎన్ని రాజకీయాలు చేశారో తెలియంది కాదని.. తమ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తోంది. విజయవాడలో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా ఎవరో ఆగంతకుడు ఆయనపై రాయి విసిరాడు. దీంతో జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో ఆయనకు స్వల్ప గాయమైంది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత సీఎం తన యాత్రను కొనసాగించారు.


అయితే టీడీపీ ఈ సమయంలో కూడా రాజకీయం చేస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఉండగా తిరుపతిలోని అలిపిరిలో మావోయిస్టులు మందుపాతర పెట్టి ఆయనపై హత్యాయత్నం చేశారు. ఆ సమయంలో వైఎస్ హవా కొనసాగుతోంది. కానీ వైఎస్ రాజకీయాలను పక్కన పెట్టి ఆయన్ను వెళ్లి పరామర్శించి సత్యాగ్రహ దీక్ష చేసి వచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు చోటు లేదు అంటూ వ్యాఖ్యానించారు.  ఆ తర్వాత ఎప్పుడూ కూడా సానుభూతి కోసం చంద్రబాబు తనకు తాను దాడి చేయించుకున్నారని వైఎస్ విమర్శించలేదు.


కానీ జగన్ పై గతంలో ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సమయంలోను టీడీపీ ఇదంతా ఆయన డ్రామాగా అభివర్ణించింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ దీనిని నిరూపించి వచ్చు. అయినా ఆ పని చేయలేదు. ఇంకా వీటిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా సీఎం పై దాడి జరిగితే ఖండించాల్సింది పోయి కోడి కత్తి 2.0, సానుభూతి కోసం అంటూ కించపరిచే పోస్టులు పెడుతోంది. ఇది ఎంత వరకు సమంజసమో టీడీపీ నేతలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: