తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ నేతలు బాహాటంగానే కుమ్ములాటకు దిగారు. రీసెంట్ గా కొవ్వూరులో వైసీపీ శ్రేణులు ఒకరికొకరు కొట్టుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు. వారి ముందే ఇరువర్గాల వైసీపీ నేతలు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కొట్టుకుంటుంటే అక్కడికి వచ్చిన నాయకులు షాక్ అయ్యారు.

వారు బీభత్సంగా రెచ్చిపోతుంటే ఆపలేక మౌన ప్రేక్షక పాత్ర పోషించారు. మొన్నటిదాకా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తలెత్తిన ఘర్షణలను చూసాం. ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మొదటి రౌండులో రిలీజ్ చేసిన లిస్టులో వచ్చిన మార్పుల కారణంగానే ఈ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు దీని పట్ల ఉత్పన్నమైన అసంతృప్తి అనేది ముగిసిపోయింది అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పటికీ దాని గురించే గొడవలు జరుగుతుండటం గమనార్హం.

మరోవైపు ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఎడమ కంటే పై భాగం రాయి తగలడంతో అక్కడ వై ఆకారంలో చర్మం పగిలిపోయింది. ఆ దాడికి పాల్పడ్డ అగంతకుడు ఎవరో కనిపెట్టేందుకు పోలీసులు, మిగతా అధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనలు, గొడవలు ఏపీలో చాలా ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకొక ఆయన సమయం మాత్రమే మిగిలి ఉంది అప్పటిదాకా పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఈసారి జగనే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి కానీ ఏదైనా జరగవచ్చు. కాబట్టి అప్పుడే అంచనానికి రాకపోవడం మంచిది.ఈసారి ఈ సీఎం జగన్ గెలిస్తే చంద్రబాబు మళ్లీ జన్మలో సీఎం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారనేదే బిగ్ క్వశ్చన్.

మరింత సమాచారం తెలుసుకోండి: