ఏపీ సీఎం జగన్ పై దాడి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత అనుభవాల దృష్ట్యా చాలామంది లైట్ తీసుకుంటున్నారు. సాను భూతి కోసమే ఇదంతా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ అనుకూల మీడియా జగన్ పై హత్యా ప్రయత్నం జరిగిందంటూ కథనాలు ప్రచురిస్తోంది. వ్యతిరేక వర్గం అయిన ఎల్లో మీడియా మాత్రం దీనిని డ్రామాగా అభివర్ణిస్తోంది.


దీంతో అసలు ఏం జరిగిందో సామాన్యులకు అర్థం కావడం లేదు. అయితే ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వారి లక్ష్యం ఏమిటీ? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లభించడం లేదు. వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడిని మరో రాజకీయ నేత విమర్శిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు వ్యక్తిగత విషయాల వరకు వెళ్లాయి. కానీ భౌతిక దాడులను ఎవరూ సహించరు. ఎందుకంటే నచ్చినా.. నచ్చకున్నా ఒక మనిషిపై ఇంకొక మనిషి భౌతిక దాడి చేయడం అనేది సహేతుకం కాదు.


కానీ జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో అసలు విషయాలు పక్కన పెట్టి రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వైసీసీ సానుభూతి కోసం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. లేదు. మాకు వచ్చిన స్పందన చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు అంటూ ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు దాడి వెనుక ఉద్దేశం వేరే ఉందంటూ వేరే కోణం బయటకు వచ్చింది.


విజయవాడలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచులు ఎక్కువగా తిరుగుతుంటారు. వీరు ఎవరైనా ఆ దారి గుండా ఎవరైనా ప్రయాణిస్తుంటే దాడి చేసి ఎంత ఉంటే అంత నగదు తీసుకొని పంపిస్తుంటారు. వీళ్లు పోటీ పెట్టుకొని మరీ రాళ్లు విసురుతుంటారు. గురి చూసి కొట్టడంలో ఆరి తేరి ఉంటారు. వీరే ఒకవేళ సరదా కోసమో.. లేక మద్యం రేట్లు పెంచారనో సీఎం ఉన్న కోపంతో దాడి చేశారని పలువురు అనుమానిస్తున్నారు. అంతే కానీ రాజకీయ నాయకులు  ఇలాంటి ఘటనలకు పాల్పడరని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: