ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయని సినిమా లాంగ్వేజీలో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి సీన్ క్లైమాక్స్ ని తలపిస్తోంది. అవును.. మొన్నటి వరకు వాలంటీర్ల వ్యవహారం. అంతకు ముందు అభ్యర్థుల జాబితా. దానికి ముందు పొత్తుల వ్యవహారమై రోజుల కొద్దీ నిరీక్షణ. ఇలా ప్రతి దానిలోను విమర్శలు.. ప్రతి విమర్శలు.


ఈ నెల ప్రారంభంలో వాలంటీర్ల రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై అధికార ప్రతిపక్ష నేతలు కత్తులు దూసుకున్నారనే చెప్పవచ్చు.  ఇది ఇప్పుడిప్పుడే సద్దు మణిగింది అనే లోపు… రాళ్ల పంచాయితీ. సీరియస్ గా మొదలైన రాళ్ల దాడి ఘటన ఇప్పుడు కామెడీగా మారుతోంది. జగన్ మీద విజయవాడలో శనివారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఈఘటనలో ఆయన ఎడమ కంటి మీద గాయం అయింది. దీంతో ఇది జాతీయ స్థాయిలోను పెద్ద చర్చకు దారి తీసింది.


ఇది కోడి కత్తి డ్రామా మాదిరిగా వైసీపీ చేయించుకొంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. కాదు కాదు.. జగన్ కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు ఈ దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక సీఎం మీద దాడి జరగడం అన్నది ఎన్నికల పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఎంత పొలిటికల్ హీట్ పెంచాలో అంత పెంచేసింది.


దీనిపై విమర్శలు, ప్రతి విమర్శల తర్వాత చంద్రబాబు నాయుడుపై, పవన్ కల్యాణ్ పై కూడా దాడులు జరిగాయి. వీటిని ఏ కోణంలో చూడాలో అర్థం కాక ప్రజలు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు దీనికి ఓ మార్గం చూపారు. ఇదంతా బ్లేడ్  బ్యాచ్, గంజాయ్ బ్యాచ్ పనిగా అభివర్ణించారు. మరి ఏపీలో ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. జగన్ పై దాడిని నాటకం అని చెప్పిన ఆయన తమపై జరిగిన దాడులను జే గ్యాంగ్ చేసిన పనులుగా చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: