ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన పరిపాలన అందిస్తూ చాలామంది ప్రజలకు ప్రియతమ నాయకుడిగా మారారు. ఆయన నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 'నవరత్నాలు' ప్రారంభించింది, ఇందులో ప్రజలకు సహాయం చేసేందుకు తొమ్మిది పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. వీటిలో రైతులకు డబ్బు, ఉచిత కళాశాల, ఆరోగ్య సంరక్షణ, మద్యపాన నిషేధం, మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం, అమ్మబడి, ఆసరా పింఛను వంటివి ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల కారణంగా వైసీపీ బీభత్సమైన పాపులారిటీని సంపాదించింది.

ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు తెగ నచ్చేసింది. వీటన్నిటి కారణంగా ఎన్నికల్లో విజయం సాధించడం వారికి సులభం అవుతుందని స్పష్టం అవుతుంది. అయితే చంద్రబాబు జగన్‌ను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఎలాగైనా మళ్ళీ సీఎం సీటును సంపాదించాలని తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయ చాణక్యుడి వలె అనేక వ్యూహాలను పన్నుతున్నారు వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతని పాచికలు ఏమీ పారడం లేదు. జగన్ మంచి పరిపాలన ముందు చంద్రబాబు రాజకీయ వ్యూహాలన్నీ కూడా తలకిందులవుతున్నాయి. ఒక్కటి కూడా అతనికి పెద్దగా లాభం చేకూర్చే లాగా ఉండటం లేదు.  

జగన్ ప్రజలకు కావలసిన దానికంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. అలానే గ్రామ వార్డు సచివాలయం, ప్రతి ఊళ్లో ఉచిత ఆసుపత్రి ఈ కారణంగా ప్రజలు ఈ పరిపాలనను బాగా మెచ్చుకుంటున్నారు. బాబు వస్తే ఈ సౌకర్యాలు అన్ని పోతాయని భయం వారికి పట్టుకుంది. జగన్ మంచితనమే చంద్రబాబు అపజయాన్ని శాసిస్తోంది. మంచితనం ముందు ఎలాంటి రాజకీయ వ్యూహమైనా సరే చిత్తు అవ్వాల్సిందే అని జగన్ మరొకసారి నిరూపించారు. మంచి నాయకుడిగా ప్రజల మనసులను గెలుచుకుంటే చాలు విజయం అనివార్యంగా మారుతుందని కూడా ప్రూవ్ చేయబోతున్నారు. ఏపీలో చంద్రబాబుని ఎదుర్కునే నాయకుడు లేరని చెప్పవచ్చు. అప్పట్లో ఆయన్ని ఓడించడం ఓన్లీ వైఎస్ఆర్ కే సాధ్యమైంది. ఇప్పుడు ఆయన బిడ్డ జగన్ చంద్రబాబుకి అసలైన మొగుడుగా మారి ఆయన రాజకీయ భవిష్యత్తును ఇరకాటంలో పడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: