రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో పోరు హోరా హోరీగా ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిన విషయ మే. దీంతో ఎవ‌రు ఎక్క‌డ పాగా వేస్తారు?  ఎవ‌రు ఎక్క‌డ స్థానాలు ద‌క్కించుకుంటారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఏకంగా ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక‌, టీడీపీ 17 స్థానాల్లోను, జ‌న‌సేన 2 చోట్లా బ‌రిలో ఉంది. మ‌రోవైపు.. వైసీపీ ఒంట‌రిగానే బ‌రిలో ఉంది. ఈ నేప‌థ్యంలో పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. బ‌ల‌మైన నాయ‌కులు కూడా బ‌రిలో ఉన్నారు.


అన‌కాప‌ల్లి నుంచి సీఎం ర‌మేష్ బ‌ల‌మైన పోటీ ఇస్తున్నారు. విజ‌య‌వాడ‌లో అన్న‌ద‌మ్ములు(కేశినేని నాని-చిన్ని) పోటీ ప‌డుతున్నారు. రాజ‌మండ్రి నుంచి బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి బ‌రిలో ఉన్నారు. వీరితోపాటు క‌డ‌ప నుంచి కాంగ్రెస్ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల త‌ల ప‌డుతున్నారు. అలాగే నెల్లూరులో నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌లిసి ఉన్న విజ‌య‌సాయిరెడ్డి, ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డుతున్నారు. వీరు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నా రు. పార్ల‌మెంటు స్థానాల్లో ఇప్పుడు ఎవ‌రు చ‌ర్చించుకున్నా.. ఈ స్థానాల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతు న్నారు. ఆయా స్తానాల్లోనూ వైసీపీ బ‌లంగా ఉన్న విష‌యం తెలిసిందే.


ఇక‌, వైసీపీ సిట్టింగుల‌పైనా ఆశ‌లు భారీగానే ఉన్నాయి. తిరుప‌తి, క‌డ‌ప‌, రాజంపేట వంటివి వైసీపీ ఖాతాలో ప‌డ‌తాయ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, శ్రీకాకుళం సంప్ర‌దాయంగా కింజ‌రాపు కుటుంబానికే ద‌క్కుతుంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖ ఎంపీస్థానంలో మాత్రం పోరు హోరాహోరీగా ఉండ‌నుంది. ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున బొత్స స‌తీమ‌ణి మాజీ ఎంపీ ఝాన్సీ బ‌రిలో ఉన్నారు మ‌రోవైపు ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బాల‌య్య అల్లుడు భ‌ర‌త్ ఉన్నారు.


ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అంటే.. మొత్తంగా ఓ రెండు మూడు మిన‌హా.. అన్ని పార్ల‌మెంటు స్థానాల్లోనూ ట‌ఫ్ ఫైటే జ‌రుగుతోంది. అయితే.. తాజాగా వెలువ‌డిన ఏబీపీ-సీఓట‌రు స‌ర్వే.. అనూహ్య ఫ‌లితాన్ని వెల్ల‌డించింది. మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాల్లోనూ 20 చోట్ల కూట‌మి అభ్య‌ర్థులు ఏక‌ప‌క్షంగా గెలుస్తున్నార‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మిగిలిన ఐదు స్థానాల్లోనూ రెండు చోట్ల మాత్ర‌మే వైసీపీ ఏక‌ప‌క్షంగా గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉంద‌ని.. మిగిలిన మూడు చోట్ల ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌నిచెప్ప‌డం విశేషం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: