ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేస్తూ అతను సౌమ్యుడు, మంచివాడు, మీరు ఓటేసి ఆశీర్వదించాలి అని కోరుతున్నారు. అయితే ఇటీవల జగన్ ఇలా చెప్పడమే పెద్ద వివాదం చర్చనీయాంశమయ్యింది. జగన్ బస్సు యాత్రలో భాగంగా భీమవరం వైపు వెళ్లారు. వైఎస్ఆర్సీపీకి చెందిన భీమవరం శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ ని ప్రజలకు పరిచయం చేస్తూ ఈయన మంచివాడు, సౌమ్యుడు.. అందరూ ఇతనికే ఓటు వేయాలి అని కోరారు.

అయితే శ్రీనివాసరావు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి ఒక నేరగాడిలాగా కనిపిస్తున్నారని, అతడిని మంచివాడు అని ఎలా చెప్తారు? అంటూ జగన్ పై చాలామంది టీడీపీ సానుభూతిపరులతో సహా న్యూట్రల్ ప్రజలు మండిపడుతున్నారు. అయితే రఘురామకృష్ణం రాజు, సృజన చౌదరి ఏమైనా నిజాయితీపరులా? అలాంటి వారిని టీడీపీ చేర్చుకుంది కదా? సొంత పార్టీలోనే నీచులను ఉంచుకొని వేరే వారిని తిట్టడం సమంజసం కాదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో చాలామంది దుర్భాషలాడుకుంటూ అసహ్యాన్ని పుట్టిస్తున్నారు.

 ఒక రాజకీయ పార్టీల్లో అందరూ ఉత్తములే ఉంటారని అనుకోవడం పొరపాటు అని ఆంధ్ర ప్రజలు గ్రహించాలి. మా సొంత లోపాలను మరచి వేరే వాళ్ళని తిడితే వాళ్లు కూడా అదే స్థాయిలో తిట్టే అవకాశం ఉంది. దీనివల్ల అనవసరంగా అవమానాలు పాలు కావడం తప్పితే ప్రయోజనాలు ఏమీ ఉండవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే జగన్ 175 అసెంబ్లీ సీట్లలో గెలుపొందాలని బాగా కోరుకుంటున్నారు. ఒకవేళ అన్ని సీట్లు గెలిస్తే జగన్ చరిత్రను తిరగ రాస్తారని అనడంలో సందేహం లేదు.

 ఇంకా ఎన్నికల సమయానికి 20 రోజుల సమయం మిగిలి ఉంది. ప్రస్తుతానికైతే సర్వేలు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తున్నాయి. టీడీపీ పార్టీ కూటమి మాత్రం జగన్ ను ఓడించి తానే అధికారాన్ని ఏర్పాటు చేస్తామనేది ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: