కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి వంగా గీత  అతనికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని ఓడించి ఆయన రాజకీయ భవిష్యత్తును అంతం చేయాలని జగన్ బాగా తపన పడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గ ప్రజలపై ఎక్కువ దృష్టి సారించారు ఇటీవల పిఠాపురం రూట్ వైపుకు వెళ్లిన జగన్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తే హైదరాబాదులోనే ఉంటాడు పనులు చేయడు అన్నట్లు ప్రసంగం వినిపించారు.

అంతేకాదు టీడీపీ, బీజేపీ పార్టీల మాదిరి ఆయన తనకు ఓటు వేయకపోతే మీకే నష్టం అన్నట్లు బెదిరించారు. పేదలకు మంచి చేయని వర్గాలను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. జగన్ కి ఓటేస్తే ఎప్పటిలాగానే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే మరుక్షణమే అవన్నీ బంద్‌ అయిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఓటేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని ప్రజలకు తెలియజేశారు.

అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పెత్తందారుల దోపిడీ వర్గానికి ఓట్లు వేయవద్దని చెప్పారు. అయితే జగన్ సమావేశానికి వచ్చిన చాలామంది ప్రజలు సీఎం అంటూ తమ మద్దతును చెప్పకనే చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి వారు గెలిపిస్తారా లేదంటే జగన్ ను నమ్మి సంక్షేమ పథకాల కోసం ఓటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సర్వేలు వైసీపీ పోయినసారి తో పోలిస్తే కొన్ని సీట్లను పోగొట్టుకుంటుందని సూచిస్తున్నాయి. గెలుపు ఖాయమన్నట్లే సర్వే ఫలితాలు చెబుతున్నాయి కానీ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే అది చరిత్ర అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఓడిపోతే 2019లో మళ్లీ పోటీ చేసే ఆసక్తి ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: