ఎన్టీఆర్ జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందిగామ‌. ఇక్క‌డ నుంచి టీడీపీ అనేక సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. 1983లో టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రెండు సార్లు మాత్ర‌మే ఇక్క‌డ పార్టీ ప‌రాజ‌యం పాలైంది. మిగిలిన అన్ని సంద‌ర్భాల్లోనూ సైకల్ ప‌రుగులు పెట్టింది. ఆ రెండు సార్లు కూడా.. ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్నాయి. 1989లో కాంగ్రెస్‌, 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నా యి. అయితే.. మిగిలిన అన్ని సార్లు కూడా.. ఇక్క‌డ టీడీపీ పాగా వేసింది.


ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున మ‌హిళా నాయ‌కురాలు పోటీ చేస్తు న్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌రిలో ఉన్నారు. వీరిమ‌ధ్యే ప్ర‌ధాన పోరు సాగ‌నుంది. ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీలు ఉన్నా కూడా.. అవి పెద్ద‌గా పోటీ ఇచ్చే అవ‌కాశం లేదు. ఇక‌, టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విష‌యానికి వ‌స్తే.. గ‌డిచిన ఐదేళ్ల‌లో పార్టీలో యాక్టివ్‌గా ప‌నిచేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువయ్యారు.


అంతేకాదు.. స్థానిక స‌మ‌స్య‌లే కాకుండా.. పార్టీపై జ‌రిగిన దాడులు, చంద్ర‌బాబును జైల్లో పెట్టిన సంద‌ర్భం లోనూ ఆమె రోడ్డెక్కారు. దీంతో ఆమె పేరు సామాన్యుల్లో అలానే ఉంది. అయితే.. ఆమెకు ప్ర‌దాన ప్ర‌తిబం ధకం.. ఆర్థిక స‌మ‌స్య‌. వైసీపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఖ‌ర్చుతో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతాని కి.. సౌమ్య వెనుక‌బ‌డి ఉన్నారు. దీంతో ఆమె ఏమేర‌కు ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తార‌నేది చూడాలి. అయితే.. కేడ‌ర్ ప‌రంగా మాత్రం బ‌ల‌మైన వ్య‌క్తిగానే ఉన్నారు.


ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు. సోద‌రుడు కూడా ఎమ్మెల్సీ కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు ముక్క‌లుగా విభ‌జించుకుని.. ప్ర‌చారాన్ని దుమ్ము రేపుతున్నారు. అయితే.. ఈయ‌న‌కు కూడా.. స‌మ‌స్య‌లు ఉన్నాయి. మూడు రాజ‌ధానులను ఇక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. దీనికి ఆయన స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు. అభివృద్ధి లేక‌పోవ‌డం కూడా స‌మ‌స్య‌గా మారింది. కానీ, మ‌నీ మేనేజ్ మెంట్ ద్వారా.. నెట్టుకురావాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: