రాష్ట్ర రాజకీయాలను సైతం శాసిస్తున్న రెండు రాజకీయ కుటుంబాలు అవి.. ఓకే సామాజిక వర్గం.. ఒకే జిల్లా.. ఒకే నియోజవర్గం కూడా కానీ ఒకరంటే ఒకరికి అసలు పడదు.. ఈ వైర్యం ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఒకరినొకరు ఢీకొట్టే పరిస్థితి కనిపించలేదు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పరస్పరం పోటీ చేయలేదట. అయినప్పటికీ ఒకరిని దెబ్బ కొట్టేందుకు ఇంకొకరు వ్యూహాలు సైతం రచిస్తూనే ఉన్నారు.


రాయలసీమలోని రాజకీయంగా పట్టు నటువంటి రెండు కుటుంబాలు ఈసారి రాజంపేట నియోజవర్గం బరిలో దిగబోతున్నాయి. ఆ కుటుంబాలలో మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు కాగా ..రెండవది వైసిపి సీనియర్ నేత మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం.. ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఒకే పార్టీలో ఉన్న వైర్యం మాత్రం ఉండేదట. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇద్దరు కుటుంబాలు కూడా వేరువేరు పార్టీల చేరాయి. వైసీపీ పార్టీలో చేరి పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలోని రాజకీయాలను ఎలుతున్నారు.


చిట్టచివరిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఒక్కసారిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు బీజేపీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చి యాక్టివ్గా మారుతున్నారు. ఈయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి తరఫున పోటీ చేస్తున్నారు. ఇలా ఈ రెండు కుటుంబాలకు ఎన్నికలు చాలా పరీక్షగా మారాయి. ఈ రాజకీయ నేతలు తలపడుతున్న తీరు చూసి రాజకీయాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతుంది.


రాజంపేట నియోజకవర్గ పరిధిలో.. పుంగనూరు, మదనపల్లి ,రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, మదనపల్లి ,తంబళ్లపల్లి వంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. Q ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్నది. అక్కడ లోక్సభ స్థానానికి 13 సార్లు ఎన్నికలు జరగగా 9సార్లు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు వైసిపి గెలిచారు. రాజంపేట లోక్సభ స్థానంలో ఎక్కువగా పెద్దారెడ్డి హవాని కనిపిస్తున్నది. అయితే వీరి హవాకు చెక్ పెట్టే విధంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోటీకి దిగబోతున్నారు. 40 ఏళ్ల చరిత్రలో ఇక్కడ టిడిపి రెండుసార్లు మాత్రమే గెలిచిందట. అందుకే చంద్రబాబు రాజంపేట నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం.


ఈసారి రాజంపేట ఎన్నికలతో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్ పడేలా కనిపిస్తున్నాయి. పదేళ్ల తర్వాత రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి మళ్లీ సక్సెస్ అవ్వాలని చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కూటమితో కలుపుకొని పార్టీ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. అయితే అక్కడ ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉండడంవల్ల బిజెపికి మైనస్ గా మారుతోంది. అలాగే మిథున్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి బాబాయి ద్వారకానాథ్ రెడ్డి సహాయంతో వైసిపి పార్టీ అక్కడ దూసుకుపోతోంది. మరి ఈ ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: