- రాయ‌ల‌సీమ‌లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగులేని వైసీపీ
- ఈ సారి కూడా క‌డ‌ప జిల్లా, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఫ్యాన్ ప్ర‌భంజ‌నం
- కోస్తాలోనూ కొన్ని సీట్ల‌లో ఫ్యాన్ జోరు.. కూట‌మి క్యాండెట్ల బేజారు

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నిక‌ల సంగ్రామం రాజుకుంది. ఇక అధికార వైసీపీ విష‌యానికి వ‌స్తే రాయ‌ల‌సీమ‌లో ఈ సారి త‌న ప‌ట్టు నిలుపుకుంటుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ మొత్తం 52 సీట్ల‌కు గాను వైసీపీ ఏకంగా 3 సీట్లు మిన‌హా 49 సీట్లు గెలుచుకుంది. ఈ సారి గ‌తంతో పోలిస్తే కొన్ని సీట్లు త‌గ్గిన‌ట్టు అనిపిస్తున్నా కూడా సీమ‌లో మెజార్టీ సీట్లు ప‌క్కా అని ప‌లు స‌ర్వేలు చెపుతున్నాయి.


ఇక వైసీపీకి ఈ సారి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని కొన్ని స‌ర్వేలు చెపుతున్నాయి. మెజార్టీ స‌ర్వేలు చెప్పిన నియోజ‌క‌వ‌ర్గాల జాబితా ఇలా ఉంది.


1) బ‌ద్వేల్ డాక్ట‌ర్ దాస‌రి సుధ
2) క‌డ‌ప - అంజాద్ బాషా
3) పులివెందుల - వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి
4) క‌మ‌లాపురం - పి. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి
5) జ‌మ్మ‌ల‌మ‌డుగు - ఎం. సుధీర్ రెడ్డి
6) మైదుకూరు - ఎస్‌. ర‌ఘురామి రెడ్డి
7) రాయ‌చోటి - గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి
8) తంబ‌ళ్ల‌ప‌ల్లి - పి. ద్వార‌కానాథ్ రెడ్డి
9) పుంగనూరు - పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి
10) ధ‌ర్మ‌వ‌రం - కేతిరెడ్డి వెంక‌ట్రామి రెడ్డి
11) గుంత‌క‌ల్ - వెంక‌ట్రామి రెడ్డి
12) సూళ్లూరుపేట - కిలివేటి సంజీవ‌య్య‌
13) నంద్యాల - శిల్పా ర‌వికిషోర్ రెడ్డి
14) య‌ర్ర‌గొండ‌పాలెం - తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌


పైన పేర్కొన్న నియోజ‌క‌వ‌ర్గాలే కాకుండా ఇంకా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైసీపీ అభ్య‌ర్థులు 20 + వేల మెజార్టీతో గెలుస్తార‌న్న అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఇక వైసీపీకి 20 వేల మెజార్టీ వ‌చ్చే సీట్ల‌లో ఎక్కువుగా బీజేపీ పోటీ చేసే స్థానాల‌తో పాటు క‌డ‌ప జిల్లా, రాయ‌ల‌సీమ జిల్లాల్లోని స్థానాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: