రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ? చెప్పలేరు. ఈరోజు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి సడన్గా సాయంత్రానికి కండువా మార్చేసి మరో పార్టీలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు గ‌డ్డపై రెండు రోజుల్లో మూడు పార్టీలు మారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన నేతలు కూడా ఉన్నారు అంటే రాజకీయాలలో ఊసరవెల్లిలా గోడ దూక‌టాలు రంగులు మార్చడాలు చాలా కామన్ అని చెప్పుకోవాలి. 2024 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జంపింగ్ జపాంగుల జోరు మామూలుగా లేదు. పలు నియోజకవర్గాలలో సీట్లు రాని నేతలు ఇతర పార్టీలలోకి దూకేసి అక్కడ సీట్లు తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ సీటు ఇవ్వలేదు.


వైసీపీ చేయించిన సర్వేలలో పాజిటివ్గా లేదని అందుకే సీటు ఇవ్వట్లేదని జగన్ చెప్పడంతో సదురు ఎమ్మెల్యే కండువా మార్చేసి పవన్ చెంత చేరిపోయారు. జనసేన కండువా వేసుకుని ... పైగా తన సొంత నియోజకవర్గ వదులుకొని మరో నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆ నేత ఎవరో కాదు చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే అర‌ణి శ్రీనివాసులు. ఈయన 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ ఇచ్చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజా ఎన్నికలలో జగన్ శ్రీనివాసులు పక్కనపెట్టి తన సొంత సామాజి వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి సీటు ఇచ్చారు.


దీంతో శ్రీని వాసులు కండువా మార్చేసి ప‌వ‌న్ చెంత చేరిపోయారు. ప‌వ‌న్ శ్రీనివాసుల‌కు చిత్తూరు కాద‌ని చెప్పి తిరుప‌తి సీటు ఇచ్చారు. ఇప్పుడు శ్రీనివాసులు తిరుప‌తి జ‌న‌సేన క్యాండెట్ గా పోటీలో ఉన్నారు. అయితే నాన్ లోక‌ల్ కావ‌డంతో అక్క‌డ శ్రీనివాసులు ప్ర‌చారంలోనే ఆప‌సోపాలు ప‌డుతోన్న ప‌రిస్థితి. అక్క‌డ ఆయ‌న వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న డిప్యూటీ మేయ‌ర్ భూమ‌న అభిన‌య్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు. మ‌రి పార్టీ మారి.. నియోజ‌క‌వ‌ర్గం మారి మ‌రోసారి త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటోన్న శ్రీనివాసులు ల‌క్ జ‌న‌సేన లో ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: