అయితే ఇప్పుడు తాజాగా తనపైన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తన కూతురికి పెళ్లి అయిందని తాను పెళ్లి కాకముందు వరకే తన ప్రాపర్టీ అని ఇప్పుడు ఆమె మెట్టినిల్లు ఆమె ప్రాపర్టీ అంటూ తెలియజేశారు.. అలాగే నన్ను నా కూతురుతో కొంతమంది కావాలని టిడిపి , జనసేన నేతలు తిట్టించారంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ.. ఈ విషయం చాలా బాధాకరమని.. అయినప్పటికీ రాజకీయం రాజకీయమే కూతురు కూతురే అంటూ ఒకసారి తెలియజేశారు.. తాను ఒక్కసారి వైఎస్ఆర్సిపి లోకి చేరిన తర్వాత ఇక ఎప్పుడు పుక్కచూపులు చూడనని.. ఎవరెన్ని ఏమనుకున్నా సరే సీఎం జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి తాను కష్టపడుతున్నానంటూ వెల్లడించారు.
తాను అందరిలాగా పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదంటూ పదవులు కూడా అడగనని నేను సేవకుని అంటూ మరొకసారి తెలియజేశారు ముద్రగడ పద్మనాభం. తాను వైయస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అంటూ కూడా వెల్లడించారు.. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటూ ఒక శపథం చేశారు ముద్రగడ.. వంగా గీతా పైన తనని గెలవనివ్వనంటూ కూడా అలాగే గెలిస్తే తన పేరు మార్చుకుంటాను అంటూ కూడా తెలియజేశారు.. మరి ఈ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి