• పుంగనూరులో నోట్ల పంపిణీ విషయంలో పోటీ పడుతున్న అభ్యర్థులు  

• బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ను ఓడించడమే పెద్దిరెడ్డి లక్ష్యం

• గెలుపు కొరకే ఓటర్ల పై డబ్బు వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే దాదాపు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో డబ్బుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు ఇస్తే ఓటర్లు తమ పార్టీకే ఓటు వేస్తారనే నమ్మకం అభ్యర్థుల్లో ఎప్పుడూ ఉంటుంది. అందుకే ప్రతిసారి ఎంతోకొంత డబ్బులను చేతుల్లో పెడుతుంటారు. అయితే ఈసారి ఏపీలో అభ్యర్థుల మధ్య టఫ్ పోటీ నెలకొన్నది. ఈ కారణంగా కొన్ని స్థానాల్లో ఓటు రేటును ఐదువేల వరకు పెంచేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో.

జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ వంటి కీలక నేతలు నిలబడుతున్న చోట నోట్ల పంపిణీ విషయంలో భారీ పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఇక వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న పుంగనూరులో కూడా సింగిల్ ఓటుకే భారీగా నగదును ముట్ట చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ బీసీవై పార్టీ నుంచి బోడె రామచంద్ర యాదవ్ ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. జనాల్లో బాగా మమేకమవుతూ వారికి ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా రెడీ అన్నట్లు రామచంద్ర యాదవ్ వ్యవహరిస్తున్నారు. పైసలు పంపిణీ విషయంలోనూ ఆయన తగ్గేలాగా కనిపించడం లేదు. పెద్దిరెడ్డి రామచంద్ర యాదవ్ ను అన్ని విషయాల్లో అణగదొక్కాలని చూస్తున్నారు కాబట్టి  ఈ నోట్లో పంపిణీ విషయంలో కూడా ఆయన కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వవచ్చు.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కూడా పోటీలో నిలుస్తున్నారు. ఈ నాయకుడు కూడా పోటీగా డబ్బులు పంచే అవకాశం ఉంది. ఇక్కడ రూ.2,000 నుంచి రూ.5,000 దాకా ఓటు రేటు పలకవచ్చని అంటున్నారు. ఏపీలో ఓవరాల్ గా చూసుకుంటే జనరల్ స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.2వేల ఇస్తున్నట్లు సమాచారం. ఇక పిఠాపురం వంటి పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో రూ.3 వేలు నుంచి రూ.5,000 ఇవ్వడానికి కూడా నేతలు సిద్ధం అయినట్లు టాక్ నడుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: